సోనియా, రాహుల్ నియోజకవర్గాలకు నిరంతర కరెంట్
posted on Apr 13, 2013 @ 12:56PM
దేశమంతా విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్న దశలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు మాత్రం విద్యుత్ కోటలు లేకుండా నిరంతర కరెంట్ ఇస్తున్నారు ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (UPPCL)వారు. UPPCL మేనేజింగ్ డైరెక్టర్ ఎ.పి. మిశ్రను వివరణ కోరగా ఈ రెండు విఐపి నియోజకవర్గాలలో తీవ్ర విద్యుత్ కోతలు ఉన్నాయని, మిగతా ప్రాంతాలలోని రోటీన్ ఎడ్జస్ట్ మెంట్ ద్వారా ఈ నియోజకవర్గాలకు నిరంతర విద్యుత్ ను సరఫరా చేస్తున్నామని, తమకి ఎవరూ ఎలాంటి సూచనలు చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి సతీమణి డింపుల్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కన్నౌజ్ నియోజకవర్గంలో కూడా విద్యుత్ కోతలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగతా విఐపి లు ప్రాతినిథ్యం వహిస్తున్న వారి నియోజకవర్గాలలో విద్యుత్ కోతలు లేకుండా చూస్తారా అని ప్రశ్నించగా సమాధానాన్ని దాట వేశారు. ఈ సంవత్సరం ఉత్తర ప్రదేశ్ లో విద్యుత్ ఉత్పాదన అంతంతమాత్రంగానే ఉంది. రోజుకు 11,500 మెగావాట్ల విద్యుత్ కావాల్సి ఉండగా కేవలం 8,000 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అయినా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నియోజకవర్గాలకు విద్యుత్ లో కోతలు కొస్తే 2014 ఎన్నికల్లో మరి వీరి పరిస్థితి ఏమిటి?