బాబాయ్ రిటైర్మెంట్ పై అబ్బాయ్ కామెంట్లు
posted on Jul 7, 2023 9:09AM
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన బాబాయ్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై వెరైటీగా స్పందిస్తున్నారు. బాబాయ్ శరద్ పవార్ పై ఓవైపు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే, మరోవైపు.. ఆయనే తమ ఆరాధ్య దైవం అని కొనియాడుతున్నారు. అందరి ముందు తనను విలన్‌గా చూపించాలని శరద్ పవార్ వ్యూహాన్ని .. అజిత్ పవార్ ఎండగడ్తున్నారు. అలా అంటూనే.. ఆయనపై ఇప్పటికీ తనకు చాలా గౌరవం ఉందని వ్యాఖ్యానించడంపై ..రాజకీయ పండితులు సైతం..ఇదేం స్ట్రాటజీ అంటూ విస్మయం చెందుతున్నారు.
ఐఏఎస్ అధికారులు 60 ఏళ్లకే రిటైర్ అవుతారు. రాజకీయాల్లో కూడా బీజేపీ నేతలు 75 ఏళ్లకే రిటైర్ అవుతున్నారు. అందుకు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలే ఉదాహరణ. అది కొత్త తరం ఎదగడానికి ఉపయోగపడుతుంది.
శరద్ పవార్ వయసుపై టార్గెగ్ చేస్తూ.. అజిత్.. బాబాయ్ ఇక విశ్రాంతి తీసుకోవాల అజిత్ అభిలషిస్తున్నారు.ఆయన విశ్రాంతి తీసుకుని.. ఆశీర్వాదాలు అందిస్తే చాలనే ధోరణిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. 2004లో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఎస్పీపీ కోల్పోవడానికి శరద్ పవార్ కారణమని అజిత్ పవార్ గట్టిగా నమ్ముతున్నారు.
2017లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వర్షా బంగ్లాలో జరిగిన సమావేశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావనలోకి వచ్చింది.
కేబినెట్ పోర్ట్‌ఫోలియో కేటాయింపు, మంత్రి పదవులపై బీజేపీ-ఎన్సీపీ మధ్య చర్చలు జరిగాయని, కానీ తర్వాత శరద్ పవార్ వలనే.. పార్టీ వెనక్కి తగ్గిందని అంటున్నారు. బాబాయ్ వలనే అప్పుడు అధికారం.. చేజారిందని.. అజిత్ అన్నట్లు సమాచారం.
అయితే..తన తండ్రిపై సోదరుడు అజిత్ పవార్ రిటైర్మెంట్ కామెంట్లపై.. శరద్ తనయ సుప్రియా సూలె స గత స్పందించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, అమితాబ్ బచ్చన్ 80 ఏళ్లు దాటిన వారేనని .. వాళ్లు తమ తమ రంగాలలో చురుకుగా పని చేసుకుని పోవడం లేరా అంటూ సుప్రియా ఎరుదాడి చేస్తున్నారు. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాలు.. గతేడాది నుంచి.. అనేక మలుపులు తిరుగుతూ.. మీడియా నోళ్లలో నానుతున్నాయి.