సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
posted on Nov 6, 2013 @ 4:04PM
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు టీడీపీ కట్టుబడి ఉందని, విభజనలో తమ పార్టీ భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మద్యప్రదేశ్‌లో ఓడిపోయిన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్చి దిగ్విజయ్ సింగ్ తెలుగువారి జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. విధివిధానాలు లేకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తోందని, హైదరాబాద్‌పై హక్కులేదని, మా మనసులను గాయపిచారని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 1972లోనే రాష్ట్ర విభజన జరిగితే బాగుండేదని, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, తాము ఇప్పటికీ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.