అఖిలపక్ష౦ ఒక రోజే..!
posted on Nov 6, 2013 @ 6:20PM
ముందు అనుకున్నట్లు అఖిలపక్ష సమావేశం రెండు రోజులు కాకుండా ఒక్క రోజుతోనే ముగించనున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈనెల 12న అఖిలపక్షం జరగనుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఐదు రాజకీయ పార్టీలు ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు అఖిలపక్షానికి రావాల్సిందిగా బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఫోన్ ద్వారా తెలియజేసింది.
అఖిలపక్షాన్ని బహిష్కరిస్తున్నట్లు మూడు రాజకీయ పార్టీలు టీడీపీ, సీసీఎం, వైసీపీలు పేర్కొనడంతో ఆ పార్టీలకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపలేదు. దీంతో ఈనెల 12, 13 తేదీల్లో అఖిలపక్షం నిర్వహించాలనుకున్న హోంశాఖ మూడు పార్టీలు లేకపోవడంతో 12వ తేదీ ఒక్క రోజుతోనే ముగించాలని భావించింది. 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఒక్కక్క పార్టీతో 30 నిముషాలపాటు చర్చలు జరపనుంది. ముందుగా ఎంఐఎం, తర్వాత బీజేపీ, సీపీఐ, టీఆర్ఎస్, చివరిగా కాంగ్రెస్‌తో కేంద్ర హోంశాఖ ఆయా పార్టీల అభిప్రాయలు తెలుసుకోనుంది.