స్నేక్ గ్యాంగ్ నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష...
posted on May 11, 2016 @ 1:53PM
స్నేక్ గ్యాంగ్ నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు నిచ్చింది. ఏ1 నుంచి ఏ7 దోషుల వరకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన న్యాయస్థానం… ఏ8 దోషికి మాత్రం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 37 మంది యువతను బెదిరించి దోపిడికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చింది.
కాగా ఈకేసులో ప్రధాన నిందితుడు ఫైసల్ దయాని(ఎర్రకుంట), ఖాదర్ బరాక్బ(ఉస్మాన్‌నగర్), తయ్యబ్ బసలమ(బండ్లగూడ,బార్కాస్), మహ్మద్ పర్వెజ్(షాయిన్‌నగర్), సయ్యద్ అన్వర్(షాయిన్‌నగర్), ఖాజా అహ్మద్ (ఉస్మాన్‌నగర్), మహ్మద్ ఇబ్రాహీం (షాయిన్‌నగర్), అలీ బరాక్బ (షాయిన్‌నగర్), సలాం హండీ (బిస్మిల్లాకాలనీ)లు నిందితులు.