పాములు @ అసెంబ్లీ!

 

 

 

అసెంబ్లీ ఆవరణలో తిరుగుతున్న పాము దంపతుల మధ్య సంభాషణ ఎలా వుంటుందో ఊహిద్దాం.

‘‘ఏవండీ.. ఏవండీ.. నిద్ర లేవండీ..’’

‘‘అబ్బా.. ఏవైందే?’’

‘‘మన చిన్నోడిని పాములు పట్టుకునేవాళ్ళు తీసుకెళ్ళిపోయారండీ’’

‘‘అదేంటే.. వాడసలు బయటికెందుకు వచ్చాడు? వాణ్ణి సీఎల్పీ ఆఫీసులో సెటిలవ్వమని చెప్పాగా?’’

‘‘సీఎల్పీ ఆఫీసులో కంపు అతి దారుణంగా పెరిగిపోయిందంటండీ. ఆ కంపుని భరించలేక బయటికొచ్చాడండీ. ఆ తెలుగుదేశం లెజస్లేచర్ ఆఫీసు నీట్‌గా వుందంటే అటువైపు వెళ్ళబోయాడు. ఇంతలోనే వాణ్ణి పట్టేసుకున్నారు. ఇప్పుడు వాణ్ణి ఏం చేస్తారో ఏంటో’’

‘‘వాడికేం కాదు ఏడవ్వాకే!  ఆ పట్టుకున్నోళ్ళెవరో మనోణ్ణి తీసుకెళ్ళి ఏ అడవిలోనో వదిలేస్తార్లే. ఇక్కడికంటే ఆడు అడవిలోనే సేఫ్‌గా వుంటాడు’’

‘‘అవునాండీ? పోనీలే.. వాడు ఎక్కడున్నా సంతోషంగా వుంటే అదే చాలు’’

‘‘అవునుగానీ ఒసే.. ఆ టీఆర్ఎస్ లెజిస్లేచర్ ఆఫీసులో మన పిల్లలు ఇద్దరు సెటిలయ్యారు కదా.. వాళ్ళింకా అక్కడే వున్నారా?’’

‘‘ఆ.. అక్కడే వున్నారండీ. కానీ ఆ ఆఫీసులోకి చాలా పెద్దపెద్ద పాములు వచ్చిపోతున్నాయంట. వాటిని చూసి మన పిల్లలు బెదిరిపోతున్నారంట. అక్కడి నుంచి కూడా బయటకి వచ్చేస్తాం మమ్మీ అని ఒకటే బతిమలాడుతున్నారు’’

‘‘ఆ వైఎస్సార్సీపీ ఆఫీసులో వున్న ఇద్దరు పిల్లల పరిస్థితేంటి?’’

‘‘ఆ ఆఫీసులో పెద్దపెద్ద కప్పలు వున్నాయంటండీ. అవెక్కడ తమమీద దాడిచేస్తాయోనని పిల్లలు భయపడిపోతున్నారంటండీ’’

‘‘సర్లే, త్వరలో అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయ్. తెలంగాణ బిల్లు చర్చకి వచ్చే అవకాశం కూడా వుంది. అప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా వుంటుందో ఏంటో.. అంచేత ఓ పన్జేద్దాం. ఈరోజు రాత్రికి మన ఫ్యామిలీ మొత్తం పక్కనే వున్న పబ్లిక్ గార్డెన్స్ లోకి షిష్టయిపోదాం’’

‘‘అలాగేనండీ’’