వయసు పరంగా చర్మంలో మార్పులు వస్తాయా??

మీలో వయస్సు వస్తున్న కొద్దీ మీ శరీరం లో ని చర్మం లో మార్పులు వస్తూ ఉంటాయి.  అలాంటి సమస్యలకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? అన్న విషయం తెలుసుకుందాం. ఆక్నిక్  కెరటో సిస్ అనేది క్యాన్సర్ కు ముందు చర్మం పై వచ్చే పెరుగుదల. ముఖ్యంగా ఎండకు ఎక్కువగా ఉండడం వల్ల పెరుగుతుందని అందుకే   శాస్త్రీయంగా సోలార్  కేరటో సిస్ గా నామకరణం చేసారు.  దీనిలక్షణం  ఎలా ఉంటుంది. ఎర్రటి మచ్చలు,చారలు  చర్మం పై కొవ్వు పెరిగినట్లు లేదా ఎరుపు, గులాబి రంగులో ఉంటుంది.  ఈలక్షణా లు కలిగి ఉండి వృద్ధి ఎక్కడ వచ్చినా దీనికి కారణం అల్ట్రా వైలెట్ కిరణాలే అది వ్యక్తులు  చేసింది కాదు. చాలా సహజంగా స్కాల్ప్ పై చెవులు,మెడ, ముఖం పై పెదాలు,భుజాలు, లేదా 
ముంజేతులు చేయి వెనుక భాగం లో శరీరంలోని ఇతర భాగాలలో ఎక్నిక్ కెర టోసిస్ వస్తుంది. దీనిని వైద్యపరిభాషలో కార్సినోమా గా మారే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు.  ఇది ఒకరకమైన చర్మ క్యాన్సర్ ప్రత్యేకంగా పెరుగుదల ఉంటె మీ సమీపం లోని  డెర్మ టాల జిస్ట్ ను సంప్రదించండి. అయాకాలాలలో వచ్చే సమస్యను బట్టి వివిదరకాల  క్రీములు లేదా శస్త్ర చికిత్స ద్వారా అంటే సర్జరీ పద్దతుల ద్వారా వాటిని తొలగించే లేదా నిలుపుదల చేయడం. లేదా ఫ్రీజ్ చేయడం కాల్చడం చేస్తారు. సేబార్ర్హెఇక్ కేరటో సిస్ శరీరం పై ఉన్న చర్మం పై ఆయా వయస్సులను బట్టి సేబార్ రేహేఇక్ కేరోటో సిస్ పెరుగుతుంది. దీనిరంగు చార, లేదా ఉదా రంగులో బ్రౌన్ రంగులో నల్లగా గుండె పై, తల పైన,వెనుక భాగం లో ముఖ్యంగా గుండెపై వచ్చిన  సేబార్ ర్హేఇక్  కేరటో సిస్ మైనం లాగా ఉంటుంది. ఇది చాలా సహాజంగా వస్తుంది. 5౦ సంవత్సరాలు పై బడిన వారిలో కుటుంబాల లో వస్తుంది.ఇవి పెరిగినట్లయితే మరిన్ని పెరిగే అవకాశం ఉంది. అయితే అవి ప్రమాదకరం కాదు.

అలా కనిపించక పోవచ్చు.ఇలాంటి చర్మ సంబందిత సమస్యలకు  డ ర్మటా లజిస్ట్ సంప్రదించడం ద్వారా వాటిని తొలగిస్తారు. అయితే శరీరం పై వచ్చిన పెరుగుదల సేబోర్ ర్హేఇక్ కేరోటో సిస్ కదా ? దాని తీవ్రత ప్రభావం ప్రమాదకరమా? లేదా చర్మ క్యాన్సరా? అన్న విష యం తెలుసుకోవాలంటే నిర్ధారణ కావాలంటే బయప్సి చేయాల్సి వస్తుంది. మీరు బట్టలు వేసుకునే  టప్పుడు చర్మానికి రాసుకుని ఇబ్బంది పెడుతుంది. మీ సమీపం లో ఉన్న డే ర్మటా లజిస్ట్ వాటిని సర్జరీ ద్వారా తొలగిస్తారు. లేదా ఫ్రీజ్ చేస్తారు.లేదా లేజర్ చికిత్స చేస్తారు. 

సోలార్ఎలాస్తో సిస్....

సోలార్ఎలాస్తోసిస్ దీర్ఘ  కాలం పాటు సూర్యరస్మి లో ఉన్నట్లయితే శారీరకంగా మార్పులు వస్తాయి. అంటే మీ చర్మం సాగిపోతుంది. దీనినే సోలార్ ఎలాస్తో సిస్ అంటారు. దీనికారణంగా ముఖంపై ముడతలు,కొన్నిరకాల చర్మం సాగిపోతుంది దీనినే   సోలార్ ఎలాస్తోలసిస్ అంటారు. దీనికారణం గా ముఖంపై ముడతలు కొన్నిరకాల గుంతలు ఏర్పడడం చూడవచ్చు. బంప్స్ వస్తాయి. శరీరం ముఖం ఎగుడు దిగుళ్ళు, గా తయారు అవుతాయి. చర్మం పసుపు రంగు వర్ణం లోకి మారుతుంది. ఎవరికైనా సోలార్ఎలాక్త్రోలసిస్ రావచ్చు. ఎవరైతే చాలా ఫెయిర్ గా అందమైన చర్మం ఫెయిర్ గా ఉండే అందమైన చర్మం పై వస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. 

పొగ తాగడం వల్ల చర్మం పాడై పోతుంది.చర్మం సోలార్ ఎలాస్త్రోలసిస్ కు దారి తీయవచ్చు. దీర్ఘ కాలంపాటు  సూర్య రస్మిలో ఉన్నట్లైతే చర్మం పై భయం కరమైన మార్పులు వస్తాయి. దీనికి చర్మ సంరక్షణ కు యంటి ఏ జింగ్  సహజంగా వాడతారు. బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడాల్సి రావచ్చు. ఆరకంగా మీ చర్మ సంరక్షణకు  చూసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.సోలార్ ఎలాస్త్రో సిస్ చికిత్సకు మీ దగ్గరలోని డ ర్మటా లజిస్ట్  చికిత్స చేస్తారు.లేజర్ తెరఫీ, ఫిల్లర్స్ బోటో క్స్  ఇంజక్షన్ లేదా ఇతర పద్దతులు. అవలంబిస్తారు. 

వేరికోస్ వేయిన్స్....

వేరికోస్ వేయిన్స్ అంటే మీ రక్తనాళాలు వ్యకోచిస్తాయి,లేదా అవి మెలితిరిగి ఉండడం గమనించవచ్చు. దీనివల్ల రక్త  నాళాలలో రక్త ప్రసారం సరిగా జరగక  తీవ్ర ఒత్తిడికి గురిఅయి  కాళ్ళలో తీవ్రమైన నొప్పులు వస్తాయి. రక్త నాళాలు చర్మం బయటికి చొచ్చుకు వస్తాయి. హై బిపి వల్లే వేరికోస్ వేయిన్స్ వస్తాయి. కాళ్ళలో పిక్కలు, చీల మండల లో వేరికోస్ వేయిన్స్ బరువు పెరుగుతారు. స్త్రీలలో స్త్రీలలో ముఖ్యంగా  గర్భిణీ  గా ఉన్నవారు., వృద్ధులలో శరీరంలో శరీర వ్యాయామం లేనప్పుడు. దూమ పానం, లేదా కాళ్ళకు గాయం అయినప్పుడు. లేదా హార్మోన్ మార్పిడి జరిగినప్పుడు. లేదా నోటి ద్వారా ముఖ్యంగా గర్భానిరోడక మాత్రలు  వాడినప్పుడు వేరికోస్ వేయిన్స్ వస్తాయి. వేరికోస్ వేయిన్స్ వల్ల కాళ్ళలో తీవ్రమైన నొప్పి చర్మం రంగు మారిపోతుంది. చర్మం పై దద్దుర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీ కాళ్ళ నుండి గుండె వరకు 3 నుండి నాలుగు సార్లు ప్రతిరోజూ ఒత్తిడిని పుట్టించే సాక్స్ వేసుకోమని సూచిస్తారు. మీరు సాక్స్ వేసుకున్నప్పటికీ సమాస్య తీవ్రంగా ఉంటె ఇబ్బందిపెట్టే వేయిన్స్ కు ఇంజక్షన్  చేస్తారు. వేరికోస్ వేయిన్స్ చికిత్స కు స్క్లీరో తెరఫి, ధర్మల్ ఎబ్రేషన్ సర్జరీ చేస్తారు.

స్పైడ ర్  వేయిన్స్...

స్పైడ ర్  వేయిన్స్ వేరికోస్ వేయిన్స్ లో భాగమే. అయితే ఇది అత్యంత ప్రమాదకరం కాదని తెలుస్తోంది.స్పైడర్  వేయిన్స్  తరచుగా కాళ్ళలో వస్తుంది. ముఖ్యంగా పా దాలు,చీల మండలు.వీటిని సూపర్ అఫిషియల్స్ అంటారు. మోకాళ్ళ కింద చర్మం పై ఎర్రగా,మంతపెడుతూ, ఉంటుంది. దురద పెడుతూ ఇతర సమస్యలతో  ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు ఒత్తిడి కలిగించే సాక్స్ వేసుకోవచ్చు. అది మీకాళ్ళ పై స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వాటిని గుర్తించిన వెంటనే దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించండి. చికిత్సలో ఉన్న వివిధ రకాల పద్దతుల గురించి పూర్తిగా క్షుణ్ణంగా అడిగి తెలుసుకోండి.చికిత్స చేయించు కొండి.

చర్మం పై దురద...

శరీరంలో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ వల్ల వస్తుంది. వయస్సు రీత్యా శరీరంలో ఆయిల్ తగ్గిన ఫలితంగానే చర్మం ఎండిపోయి నట్లు పొడి బారిపోయి  ఉండడం వల్ల సమస్య  మరింత తీవ్రమౌతుంది. పొడి బారిన చర్మానికి ఏదైనా మోయిస్చరైజర్, సరిపోతుంది. ఇందు కోసం నీరు అధికంగా తాగాలి. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సబ్బులు, హ్యుమిడి ఫైర్లు వాడాలి. దీనివల్ల దురద తగ్గవచ్చు. మీకు పెర్ఫ్యుం గనక వాడే అలవాటు ఉంటె దురగ మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెపుతున్నారు. మీరు కొన్ని వారాలుగా దురదా తో బాధపడుతున్నారా మీరు డాక్టర్ ను సంప్రదించండి. ఇది మరింత తీవ్రతరం కావచ్చు. లేదా కిడ్నీకి సంబంధించి,డయాబెటిస్,రక్త హీనత.లివర్ సమస్య కావచ్చు. ఈ సమస్యను గుర్తించి సత్వరం చికిత్స చేసుకోవడం అవసరం. సమాస్తాను ప్రాధమిక స్థాయిలో గుర్తించి చికిత్స తీసుకుంటే దీర్ఘకాలిక సంమాస్యగా మారకుండా ఉంటుంది.

లెగ్ ఉల్సర్స్ / కాలిలో అల్సర్స్...

మీ కాళ్ళలో  పండ్లు  ఏర్పడుతాయి. వాటిని  నిర్లక్ష్యం చేయద్దు. అలా బయటికి వచ్చిన పుండ్ల వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయి అనారోగ్య  సమస్యల కు దారి తీయవచ్చు. డయాబెటిస్, వల్ల కాళ్ లో అల్సర్స్ రావచ్చు.  వేరికోస్ వేయిన్స్ వల్ల ధూమపానం, గర్భవతిగా ఉన్నప్పుడు, ఊబకాయం, ఒక వేళ మీ కాళ్ళలో అల్సర్స్ వస్తే  వైద్యులు లెగ్ అల్సర్స్  క్లినిక్ కు రెఫర్  చేయవచ్చు. లెగ్ అల్సర్స్ కు చికిత్స రోగి వయస్సు పై ఆధార పడి ఉంటుంది. లేదా రోగి పూర్తి ఆరోగ్యం,అల్సర్స్ కు గల కారణం బట్టి ఆధార పడిఉంటుంది. సాధారణం గా  మీగాయాన్ని మీరే శుభ్రం చేసుకోవాల్సి  ఉంటుంది. ఆప్రాంతంలో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. అంటే కంప్రెషన్ తో కూడిన సాక్స్ లెగ్ అల్సర్స్ ఉన్నవారికి సర్జరీ చేయాల్సి రావచ్చు.

కాంటాక్ట్ డెర్మటైటిస్...

కాంటాక్ట్ డెర్మటైటిస్ లక్షణం  చ్గార్మాం పై ఎర్రగా ఉంటుంది. దద్దుర్లు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ఎలర్జీ వల్ల చర్మం ఇరిటే టింగ్ గా ఉంటుంది. కాంటాక్ట్ డెర్మటైటిస్ ను రెండురకాలుగా ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇరి టేట్  కాంటాక్ట్ డెర్మటైటిస్...

ఈ సమస్య చాలా సహజనైనదని ఇతర దద్దుర్లు మాదిరి గానే ఉంటాయి. ఇది కొన్ని రకాల మొక్కల ద్వారా  షాంపూలు ఆల్కాహాల్, బ్లీచ్, డిటర్  జెంట్స్ ఇతర రాసాయనాలు, చర్మం పై ప్రతి చర్య జరిగి ఎలర్జీ గా మారుతుంది. 

ఎలర్జీ కాంటాక్ట్ డెర్మటైటిస్...

చర్మం యొక్క స్థితి ని బట్టి

ఉదాహరణకు...విషపూరిత మైన మొక్కలు వ్యక్తి గత సంరక్షణ ఉత్పత్తులు కృత్రిమ ఆభరణాలు ఇతర రాసాయనాలు కావచ్చు. ఈ సమస్యకు చికిత్సలో భాగం గా ఎలర్జీ ని వృద్ధి చేసే వస్తువులను, సబ్బులు,చర్మం పై మోయిస్చరైజ్, సాధనాలు, క్రీములు, లోషన్లు మీ చర్మాన్ని రక్షిస్తాయి. 

స్కిన్ కాన్సర్/ చర్మ క్యాన్సర్...

స్కిన్ క్యాన్సర్ సహజమైన కండీషన్ గా నిపుణులు పేర్కొన్నారు. 7౦ సంవత్సరాల వయస్సు పై బడిన వారిలో ప్రతి ఐదుగురిలో చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. చర్మ క్యాన్సర్ కు ప్రాధాన కారణం సూర్యరశ్మి ని ఎదుర్కోవడమే. ఎవరైతే చాలా ఫెయిర్ గా ఉంటారో కాళ్ళు రంగులు రంగులు గా ఉంటాయి. ఎర్రటి జుట్టు ఉన్న వారిలో ఇది ప్రమాదకారిగా మారచ్చు. కొంత మందిలో చర్మ క్యాన్సర్ రావడానికి ఎక్కడైతే సూర్య రశ్మి చేరదో అంటే శరీరంలోని చంకలు, లోపలి భాగాలు లేదా జనటిక్స్ టాక్సిస్ క్యాన్సర్  వృధిలో కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యరస్మికి దూరంగా ఉంటూ సన్ స్క్రీన్ లోషన్స్ వాడండి. మేఘావృతంగా ఉన్నరోజుల్లో తనింగ్ బర్స్ ను చూదండి. చర్మ క్యాన్సర్ కు రకరకాల చికిత్సలు చేస్తారు. క్యాన్సర్ స్టేజి నిబట్టి క్యాసర్ సైజు ను బట్టి చికిత్సలు చేస్తారు.

సోగ్గి స్కిన్ / కుంగి పోయిన చర్మం...

మీ చర్మం కుంగి పోయింది బిరుసుగా ఉండే చర్మం. మీ మెడ మీద దవడ ఎముకల ప్రాంతాలాలో సహజంగా ఒడులుగా ఉంటుంది. చాలా మంది ఈ సమాస్యను టర్కీ నేక్ అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు.అంటే టర్కీ కోళ్ళ ను పోలి ఉండడం వల్ల ఆటపట్టిస్తూ ఉంటారు. వయస్సు రీత్యా చర్మం సాగి పోతుంది. సాగింగ్ కొవ్వు పదార్ధాలు పేరుకు పోయి దవడ క్రింది భాగం లో గడ్డం కింద సాగిపోతాయి. ఆప్రాంతంలో ముఖం అందవికారంగా తయారవుతూ ఉంటుంది. ఇక మెడ కండరాలు బలహీన పడతాయి. వర్టికల్  గా ఉండే బ్యాండ్స్  వాడాల్సి ఉంటుంది. మీ మెడ పై భాగాన ఉన్న ప్రాంతాన్ని సంరక్షించండి. మీ మెడను సూర్య రస్మికి దూరంగా ఉంచండి. సన్ స్క్రీన్ మోయిస్చ రైజర్స్ రాసుకోండి.మీరు మెడ దవడ, ప్రాంతలాలో వ్యాయామం చేయండి. ఆ ప్రాంతం లో గట్టి పడతాయి. సాగి పోయిన లేదా కుంగి పోయిన అంటే జీవం లేని చర్మం కాకుండా మరే ఇతర  సమస్యలు ఉంటె  డ ర్మటా లజిస్ట్,  సర్జన్ తో సర్జరీ అవసరం  లేకుండా చికిత్సలు ఉన్నాయేమో తెలుసుకోండి. 

బ్రుసిన్స్ / అంటే గాయాలు...

బ్రూస్ అంటే చర్మం పై గట్టిగా పేరుకు పోయిన లేదా మచ్చలు. గాటు, మీరు మీ టేబుల్ పై చేయిపెట్టినప్పుడు ఏదైనా గాయం అయినప్పుడు. లేదా రక్తనాళాల వద్ద గట్టిగా ఒత్తుకు పోయి రక్తం నల్లగా గడ్డకట్టి నప్పుడు. అదే మీరు గాయాల పాలై మీ శరీరం పై రక్తం గూడు కట్టుకున్నప్పుడు. కాలికి గాయమై ఆప్రాంతమంతా నల్లగా లేదా నీలపు రంగులో గడ్డ కట్టుకున్నప్పుడు. లేదా రక్త నాళాలు చర్మం కింది భాగం లో ఉన్నప్పుడు. చర్మం డ్యామేజ్ అయినప్పుడు రక్తం కారి నప్పుడు. ఆ చర్మం పై ఏర్రరంగులో,ఊకో చోటా నల్లగా, ఇంకోచోట,నీలపు రంగంలో మరక పది పోతుంది. సమస్య  ఉన్న వారిలో వృద్ధులలో బ్రూస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

వయస్సు వల్ల చర్మం పల్చబడి పోవడం వల్ల లేదా శరీరంలో కొవ్వు తగ్గిపోవడం వల్ల  చాలా త్వరగా మచ్చలు,గాట్లు,ఏర్పడ తాయి. చాలా రకాల బ్రూస్ కావడానికి కారణం కేవలం చిన్న చిన్న గాయాలే,అదీ కాక ఏది ఏమైనా కొన్ని సమయాలలో చాలా తీవ్రంగా ఉండచ్చు. బ్లడ్ తిన్నర్స్, వల్ల మరకలు, మచ్చలు, పడచ్చు.మీకు భారీ సంఖ్యలో పెద్దపెద్ద మచ్చలు పడతాయి. అది రక్త శ్రావం కారణం కావచ్చు. అప్పడు తప్పని సరిగా మీరు డాక్టర్ ను సంప్రదించాల్సి రావచ్చు. స్కిన్ క్రాఫ్టింగ్, లేదా మీ ముఖం పై పడ్డ మచ్చను తీసివేయడానికి ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి రావచ్చు.

వ్రిన్ కిల్స్ / అంటే ముఖం పై ముడతలు....

ముఖ్యంగా ఈ మధ్య కాలం లో వయస్సు రీత్యా ముఖం పై ముడతలు, కంటి కింద చా రలు, మిమ్మల్ని ఆత్మన్యూనతా భావం తో ఉంటారు. వయస్సు వచ్చేసిందా అని భావిస్తూ దీనికోసం ఏమైనా చేయాలనే ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ముడతలు వయస్సు పెరుగుతున్న కొద్దీ  వస్తాయి. వయస్సు రీత్యా చర్మం పలుచబడి పోవడం మోయుస్చరైజర్ ను తక్కువగా కలిగి ఉంటుంది. దీనికారణం శరీరం లో తక్కువ శాతం ఆయిల్ ఉండడమే, ఆయిల్ దీనివల్ల శరీరానికి జరిగిన గాయం మానడానికి చాలా మెల్లగా  తగ్గుతూ ఉంటుంది. ముఖం పై ఉన్న కండరాల లో మార్పు వల్ల  రక రకాల  హావ భావాలు వస్తూ ఉంటాయి. ముడతల వల్ల చర్మం మరింత లోతుకు పోయి ముడతలు స్పష్టంగా కనిపిస్తాయి. పొగతాగడం సూర్యరస్మి కారణంగా ముఖం పై ముడతలు వస్తాయి. 

మరి ముఖం పై వచ్చే ముడతలను ఏమిచేస్తారు. ప్రతి రోజూ మోయిస్చరైజ్ చేయండి. క్లింజర్స్ వాడండి. పోగాతాగాకండి,ఒక వేళ మీకు అలవాటు ఉంటె  మాని వేయండి. సూర్య  రాస్మికి దూరంగా ఉండండి.తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సి వస్తేసన్ స్క్రీన్ లోషన్ ను వాడండి. ఎ మోస్చారైజర్ వాడాలి, ఏజింగ్ వ్రింకిల్ నివారణకు  ఏది యాంటి ఏజింగ్ కేర్ తీసుకోవాలి తెలుసుకోండి. మీ డెర్మటాలజిస్ట్ ను అవసరమైన పక్షం లో సంప్రదించండి. డాక్టర్ సలహా తీసుకోండి. ముఖంపై ముడతలు వచ్చాయని బాధ పడకండి. ముడతలను ఎదుర్కోడానికి శుద్ధంగా ఉండండి. మీ డర్మటా లజిస్ట్ ఫైల్లెర్ల గురించి  చర్చించండి. కెమికల్ పీల్స్ లేజర్ సర్ఫెసింగ్ సర్జరీ గురించి తెలుసుకోండి.

 

కల్తీ లవంగాల కనికట్టు.. వీటిని తింటే ఎంత నష్టమంటే..!

  లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  చాలా రకాల ఆహార పదార్థాల తయారీలోనే కాకుండా ఔషధ గుణాలు ఉన్న కారణంగా ఏవైనా ఆరోగ్య సమస్యల కోసం కూడా లవంగాలను వాడుతుంటారు. చాలామంది రోజూ ఒక లవంగం తినడం లేదా లవంగాలు ఉడికించిన నీటిని తాగడం చేస్తుంటారు. ఇదంతా శరీరం డిటాక్స్ కావాలని, శరీరంలో ఉండే చెడు పదార్థాలు,  మలినాలు తొలగిపోవాలని, రోగనిరోధక శక్తి బలంగా మారాలని చేస్తుంటారు. అయితే మంచి లవంగాలకు బదులు నకిలీ లవంగాలను వాడితే మాత్రం ఆరోగ్యానికి మేలు జరగకపోగా.. బోలెడు నష్టాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు కల్తీ లవంగాలను ఎలా కనిపెట్టాలి? కల్తీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. కల్తీ లేదా నకిలీ లవంగాలు.. మార్కెట్లో లభించేవన్నీ మంచి లవంగాలు అనుకుంటే పొరపాటు.  చాలా వరకు లవంగాలలో నూనెను సేకరించి, వాటిలో వాసన, సారం అనేవి అన్నీ కోల్పోయాక వాటిని అమ్ముతుంటారు. కొందరేమో వాసన, సారం, నూనె కోల్పోయిన లవంగాలకు రసాయనాలు జోడించి వాటిని అమ్ముతుంటారు. ఇవ్నీ కల్తీ లేదా నకిలీ లవంగాలు అని ఆహార నిపుణులు అంటున్నారు. ఈ లవంగాలు ఎటువంటి ప్రయోజనాలను అందించవు.  ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కల్తీ లవంగాలు జీర్ణం కావడం కష్టం,  గ్యాస్, కడుపు నొప్పి, ఆమ్లతత్వం,  వికారం వంటి సమస్యలకు ఇవి కారణం అవుతాయి. కల్తీ లేదా నకిలీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలు.. పుఢ్ పాయిజన్.. సరిగ్గా తయారు చేయని లేదా రసాయనాలతో కల్తీ  చేయబడిన లవంగాలు ఫుడ్ పాయిజన్ కు  కారణమవుతాయి. దీని వలన వాంతులు, విరేచనాలు, బలహీనత,  తీవ్రమైన కడుపు తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో వాపు, తలనొప్పి.. నిజమైన లవంగాలు మంటను తగ్గిస్తాయి. కానీ నకిలీ లేదా కల్తీ  లవంగాలు ఈ లక్షణాలను కలిగి ఉండవు. బదులుగా అవి శరీరంలో మంటను పెంచుతాయి. కల్తీ లవంగాలకు రంగు,  సువాసన కోసం రసాయనాలను కలిపి ఉంటారు. ఇవి తలనొప్పి,  తలతిరుగుటకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తి మటాష్.. నిజమైన లవంగాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. కానీ నకిలీ లవంగాలు శరీరానికి ఎటువంటి ప్రయోజనాలను అందించవు. ఎక్కువ కాలం నకిలీ లేదా కల్తీ లవంగాలను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది. లివర్ నాశనమే.. చవకగా లభించే లవంగాలు,  రసాయనాలతో కల్తీ చేసిన సుగంధ ద్రవ్యాలు  కాలేయానికి క్రమంగా హాని కలిగిస్తాయి. ఇవి వెంటనే వాటి దుష్ప్రభావాలు బయటకి కనిపించేలా చేయకపోయినా వీటి నష్టం క్రమంగా బయటపడుతూ ఉంటుంది. నకిలీ లేదా కల్తీ లవంగాలు గుర్తించడం ఎలా.. ఒక గ్లాసు నీరు తీసుకొని కొన్ని లవంగాలు వేయాలి. లవంగాలు కల్తీ కాకపోతే అవి  మునిగిపోతాయి, కానీ అవి కల్తీ అయితే తేలుతాయి. అంతేకాదు.. లవంగాల నుండి నకిలీ రంగులు,  రసాయనాలు విడుదల కావడం కూడా కనిపిస్తుంది. నిజమైన లవంగాలు మంచి సువాసన, ఎక్కువకాలం కలిగి ఉంటాయి.  అదే నకిలీ లవంగాలు వాసన ఉండవు,  రంగు కూడా నిజమైన వాటితో పోలిస్తే వేరుగా ఉంటాయి. నకిలీ లవంగాలు నల్లగా,  పొడిగా,  బరువు లేకుండా తేలికగా,  చాలా సులభంగా విరిగిపోయేలా ఉంటాయి.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఆయుర్వేదం చెప్పిన రహస్యం.. ఉసిరికాయ ఇలా తింటే మ్యాజిక్కే..!

  ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఉసిరికాయ వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే ఉసిరికాయను తినే విధానం చాలా ముఖ్యం అని ఆయుర్వేదం చెబుతోంది.   అసలు ఉసిరికాయను ఎలా తినాలి? ఆయుర్వేదం చెప్పిన ఆ విధానంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. ఉసిరికాయ ఉడికించి.. ఉసిరికాయను జ్యూస్ లాగా,  పచ్చిగా తినడం చూసే ఉంటారు. చాలామంది ఊరగాయ లాగా నిల్వ చేసుకుని కూడా తింటారు.  అయితే ఉసిరికాయను అలా కాకుండా ఆవిరి మీద ఉడికించి తింటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయట.  ఆవిరి మీద ఉడికించడం వల్ల ఉసిరికాయలో ఉండే విటమిన్-సి చెక్కు చెదరదని ఆయుర్వేద నిపుణులు కొందరు చెబుతున్నారు. ఉడికించిన ఉసిరికాయ ప్రయోజనాలు.. రోగనిరోధక వ్యవస్థ.. ఉడికించిన ఉసిరికాయలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  జలుబు,  దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియ.. ఉడికించిన ఉసిరికాయ  జీవక్రియను మెరుగుపరుస్తుంది,  మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.  ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాకు ఇది  సహాయపడుతుంది.  చర్మం,  జుట్టు.. ఉసిరికాయ అందాన్ని చేకూర్చే  అద్భుతమైన ఫలం. ఉడికించిన ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ సి చర్మ స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. జుట్టు కుదుళ్లకు  పోషణ ఇస్తుంది.  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది,  జుట్టును మందంగా, బలంగా,  మెరిసేలా చేస్తుంది. గుండె జబ్బులు.. ఉడికించిన ఉసిరికాయ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి,  మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు,  అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉసిరిలో ఉండే  శోథ నిరోధక లక్షణాలు శరీరంలో మంట,  చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. కంటి చూపు.. విటమిన్ సి,  ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఉసిరికాయను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు సంబంధిత కంటి సమస్యలైన మాక్యులర్ డీజెనరేషన్,  కంటిశుక్లం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలా తినాలంటే.. ఒక తాజా ఉసిరికాయను  బాగా కడిగాలి.  ఒక కుండలో లేదా బౌల్ లో నీరు పోసి పైన ఒక చెల్లు ప్లేట్ లేదా గిన్నె ఉంచి అందులో ఉసిరికాయను వేసి పైన మూత పెట్టాలి.  5నుండి 10 నిమిషాలలో ఉసిరికాయ మెత్తబడుతుంది.  ఆ తర్వాత దాన్ని బయటకు తీసి చల్లబడిన తర్వాత నమిలి నేరుగా తినవచ్చు.       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                          

డిప్రెషన్ బాధితులకు గుడ్ న్యూస్.. 7రోజులు ఇలా చేస్తే షాకింగ్ ఫలితాలు పక్కా..!

డిప్రెషన్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య.  చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ డిప్రెషన్ ఊబిలో చిక్కుకుంటున్నారు. దీన్నుండి బయటపడటానికి మానసికంగా యుద్దం చేస్తుంటారు.  చుట్టూ ఉన్న అందరూ సపోర్ట్ చేస్తే తప్ప దీన్నుండి సులువుగా బయట పడలేరు. డిప్రెషన్ కారణంగా నమోదు అవుతున్న మరణాలు కూడా చాలానే ఉంటున్నాయి.  అయితే డిప్రెషన్ లో నలిగిపోతూ ఇక తమ జీవితం అంతే నిరాశలో ఉండేవారికి గుడ్ న్యూస్.. డిప్రెషన్ ను తరిమి కొట్టే అద్బుతమైన మార్గం ఉంది.  కేవలం 7రోజులు చాలు.. జీవితంలో అద్బుతం జరుగుతుంది.  ఈ విషయం స్వయానా పరిశోధకులు,  వైద్యులు స్పష్టం చేస్తున్నారు.  ఇంతకూ 7 రోజులు చేయాల్సిన పనులేంటి? ఇది డిప్రెషన్ తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. ఫోన్ బంద్.. డిప్రెషన్ ఎండ్.. డిప్రెషన్ సమస్యను ఎండ్ చేయడానికి ఫోన్ బంద్ చేయడం అతిగొప్ప మార్గమని వైద్యులు, పరిశోధకులు అంటున్నారు.  ఒక పరిశోధన ప్రకారం కేవలం వారం రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల డిప్రెషన్ లక్షణాలు 24శాతం తగ్గాయని చెబుతున్నారు.  అంతేకాదు.. ఆందోళన సమస్య 16.1 శాతం,  నిద్రలేమి, నిద్రకు సంబంధించిన సమస్యలు దాదాపు 14.5 శాతం తగ్గాయట.  కాబట్టి సోషల్ మీడియాకు వారం రోజులు దూరం ఉంటే ఇన్ని సమస్యలు మంత్రించినట్టు తగ్గుతాయని అంటున్నారు.  సోషల్ మీడియా అంటే స్మార్ట్ ఫోన్,  అందులో నెట్ కనెక్షన్.. ఇవి రెండూ దూరంగా ఉంటే చాలని అంటున్నారు. సోషల్ మీడియా డిటాక్స్ ప్లాన్.. 7రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం అనే ప్లాన్ ను దశల వారిగా ఈ కింది విధంగా ఫాలో కావచ్చు. 1రోజు.. సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉండాలో.. ఆత్మ పరిశీలన చేసుకుని.. ఆ తరువాత విషయాన్ని ఒక కాగితం మీద కొన్ని లక్ష్యాలు రాసుకోవాలి.  దీనివల్ల ఎవరికి వారికే తాము సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉండాలి, దాని వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అనే విషయం అర్థం అవుతుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి తమకు తాము రెఢీ అవుతారు. 2వ రోజు.. సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి మంచి మార్గం నోటిఫికేషన్లను ఆప్ చేయడం.  నోటిఫికేషన్ల వల్ల ఫోన్ ను పదే పదే తీయవలసి వస్తుంది. నోటిఫికేషన్లను ఆఫ్ చేయాలి. హోమ్ స్క్రీన్ మీద సోషల్ మీడియా యాప్ లను తీసేయాలి. వాటిని ఫోల్డర్ లలో ఉంచి యాప్ లను తెరిచే అవసరం తగ్గించాలి. 3వ రోజు.. రోజూ ఫోన్ చూస్తూ గడిపే సమయాన్ని కాస్తా మంచి అలవాట్ల కోసం వెచ్చించాలి.  కొంతసేపు పుస్తకం చదవడం,   వ్యాయామం, మంచి అభిరుచి, ఎప్పటినుండో నేర్చుకోవాలని అనుకున్న పనిని నేర్చుకోవడం, ఆర్ట్స్ క్రాఫ్ట్స్,  తోటపని ఇట్లా ఏదైనా సరే.. సోషల్ మీడియాకు దూరంగా మనసును లాక్కెళ్లాలి. 4వ రోజు.. సోషల్ మీడియా నుండి బయటకు వచ్చి చుట్టూ ఉన్న పరిసరాలు,  జరుగుతున్న పరిస్థితులతో మాత్రమే కనెక్ట్ అవుతూ ఉండాలి.  చేసే ప్రతి పనిని మనసుతో ఆస్వాదిస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మెదడు మానిటైజ్ అవుతుంది. మెదడు మీద సోషల్ మీడియా ఒత్తిడి మెల్లిగా తగ్గడం మొదలవుతుంది. 5వరోజు.. మానసికంగా మెరుగ్గా ఉండటానికి ద్యానం, శ్వాస వ్యాయామాలు బాగా సహాయపడతాయి.  అందుకే రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయాలి. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఎలా అనిపిస్తోంది, మనసు ఎలా ఫీలవుతోంది,  ఏ పని తేలికగా అనిపించింది, ఏ పని కష్టంగా అనిపించింది మొదలైనవన్నీ ఒక జర్నలింగ్ రాసుకోవాలి. ఇది జరుగుతున్న మార్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 6వ రోజు.. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటే ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపడం చాలా మంచిది. అది కూడా నేరుగా వ్యక్తులతో కలిసి సమయాన్ని గడపాలి. ఇది బంధాలను బలపరచడమే కాకుండా,  డిప్రెషన్ వంటి భూతాన్ని పారద్రోలడానికి బంధాలు ఎంతగా సహకరిస్తాయో కూడా అర్థం చేసుకునేలా చేస్తుంది. 7వ రోజు.. వారంలో జరిగిన ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న మార్పును రివైండ్ చేసుకోవాలి.  ఏ చిన్న రిలీఫ్ కనిపించినా చాలా గొప్ప ఫలితం సాధించినట్టే.. ఎందుకంటే ఒక్కసారి గెలుపు రుచి చూస్తే దానికోసం అలాగే కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది. మెల్లిగా సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉండాలో అంత దూరం ఉంటూ కేవలం అవసరం కోసం మాత్రమే లిమిట్ గా సోషల్ మీడియా ఉపయోగించడం నేర్చుకుంటే డిప్రెషన్ భూతాన్ని తరిమి కొట్టేయవచ్చు.                         *రూపశ్రీ.

దోసకాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలున్నవారికి మంచిది కాదు..!

దోసకాయ తినడానికి  చాలా మంది  ఇష్టపడతారు. సాధారణంగా దోసకాయను  కూరగాయల లిస్ట్ లో చెబుతారు. దోసకాయలో నీరు  సమృద్ధిగా ఉండటం వలన ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది,  శరీరం డీహైడ్రేట్ కాకుండా  నివారిస్తుంది. అయితే చాలా మంది దోసకాయను వంటకంగా కాకుండా నేరుగా తినడానికి లేదా  సలాడ్, రైతా లలో జోడించుకోవడానికి ఇష్టపడతారు.  ఇంకొందరు  ఉప్పుతో కలిపి తింటారు. దోసకాయలు ఆరోగ్యానికి చాలా మంచివిగా పరిగణించబడతాయి. కానీ కొందరికి మాత్రం దోసకాయ చేటు చేస్తుందని చెబుతారు.  ఇంతకీ దోసకాయలో ఉండే పోషకాలు ఏంటి? దోసకాయలను ఎవరు తినకూడదు? తెలుసుకుంటే.. దోసకాయ పోషకాలు.. దోసకాయలలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం,  మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు  ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.  దోసకాయలు ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయో, అవి కొంతమందికి  హాని కూడా చేస్తాయి.   దోసకాయలు ఎవరు తినకూడదంటే.. దోసకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే కొందరిలో  గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం లేదా తిమ్మిరి వంటి సమస్యలు పెరుగుతాయి. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు లేదా ఇప్పటికే ఎసిడిటీ లేదా ఉబ్బరంతో బాధపడుతున్నవారు దోసకాయలను తక్కువగా తినాలట. లేదంటే  అస్సలు తినకపోవడం మేలట. ఎందుకంటే ఇది వారి సమస్యలను మరింత పెంచుతుంది. దోసకాయలు చల్లదనాన్ని కలిగి ఉంటాయి. ఎవరికైనా ఇప్పటికే దగ్గు, జలుబు లేదా గొంతు నొప్పి ఉంటే వారు  దోసకాయ తినడం మంచిది కాదు. దీని శీతలీకరణ ప్రభావం దగ్గును తీవ్రతరం చేస్తుంది.  జలుబును పెంచుతుంది. కాబట్టి దగ్గు, జలుబు,  గొంతునొప్పి వంటివి ఉన్నవారు దోసకాయ తినకపోవడం మంచిది. కొంతమందికి దోసకాయ తిన్న తర్వాత అలెర్జీ సమస్యలు వస్తాయి. పెదవులు లేదా గొంతు దురద, వాపు, కడుపు నొప్పి,  వికారం వంటి అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. దోసకాయ తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దోసకాయ తినడం మానేయడం మంచిది. దోసకాయ ఒక సహజ మూత్రవిసర్జన పదార్థం. అంటే ఇది మూత్రవిసర్జనను పెంచుతుంది. ఎవరికైనా ఇప్పటికే తరచుగా మూత్రవిసర్జన ఉంటే, దోసకాయ వారి సమస్యను మరింత పెంచుతుంది. అలాంటి వారు చాలా తక్కువ మొత్తంలో లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత దోసకాయ తినడం మేలు. దోసకాయలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా రక్తపోటును కూడా కొద్దిగా తగ్గిస్తాయి. ఎవరికైనా ఇప్పటికే తక్కువ రక్తపోటు ఉంటే దోసకాయను ఎక్కువగా తినడం వల్ల తలతిరుగుడు, బలహీనత లేదా అలసట వస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు దోసకాయలను తక్కువగా తీసుకోవాలి. కొంతమందికి జలుబు సులభంగా సోకుతుంది. ఇలాంటి వారు చల్లని పదార్థాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు.  సులభంగా జలుబుకు గురయ్యే అవకాశం ఉన్నవారు, చేతులు కాళ్ళు చల్లగా ఉంటే లేదా తరచుగా కడుపులో చలి ఉండటం వంటి సమస్యలున్నవారు దోసకాయలు తినడం అస్సలు మంచిది కాదు.                                *రూపశ్రీ.

శీతాకాలంలో తులసి టీ చేసే మ్యాజిక్ ఇదే..!

  శీతాకాలం ఆరోగ్యానికి పరీక్షలు పెట్టే కాలం.  శీతాకాలంలో చలి కారణంగా జలుబు, ఇన్ఫెక్షన్లు,  చర్మం పగలడం,  దురదలు,  ర్యాషెస్, డాండ్రఫ్ వంటివి చాలా వస్తాయి.  ప్రతి సమస్యను తగ్గించుకోగానే మరొక సమస్య రెఢీ అవుతూ ఉంటుంది.  అన్నింటి కంటే ముఖ్యంగా చలి కారణంగా శరీరంలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉంటుంది. వీటి నుండి ఉపశమనం కోసం చాలామంది అల్లం, వెల్లుల్లి, తులసి వంటి ఔషద గుణాలు ఉన్న పదార్థాలు బాగా వాడుతుంటారు.  అయితే శీతాకాలంలో తులసి టీ తయారు చేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. తులసి అద్బుతమైన మూలిక.. తులసి అద్బుతమైన మూలిక అనే విషయం అందరికీ తెలిసిందే. తులసికి ఆయుర్వేదం నుండి అన్ని రకాల వైద్యాలలో చాలా ప్రాముఖ్యత ఉంది.  తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలంగా మార్చడంలో సహాయపడతాయి.  చలికాలంలో ఆరోగ్య సంరక్షణ కోసం తులసిని పుష్కలంగా వాడవచ్చు. సీజన్ సమస్యలకు చెక్.. వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే ముక్కు దిబ్బడ,  దగ్గు,  గొంతు నొప్పి వంటి సీజన్ సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో తులసి టీ చాలా బాగా సహాయపడుతుంది. శ్వాస సమస్యలు.. చలికాలంలో చల్లని గాలుల కారణంగా చాలామంది శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు.  ముఖ్యంగా ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలు శీతాకాలంలో విజృంభిస్తుంటాయి.  ఈ సమస్యల కు చెక్ పెట్టడానికి తులసి చాలా బాగా పనిచేస్తుంది. చర్మానికి తులసి.. తులసిలో వేడి గుణాలు ఉంటాయి.  తులసిని తీసుకున్నప్పుడు శరీరంలో వేడి పుడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగ్గా ఉంచుతుంది. చలి నుండి చర్మాన్ని రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. పొట్ట ఆరోగ్యం.. తులసి టీ తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం,  బరువు తగ్గడం,  కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  పొట్ట ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. షుగర్ సమస్య రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండేవారు రెగ్యులర్ గా తులసి టీ తాగుతూ ఉంటే సుగర్ లెవల్స్ క్రమంగా నియంత్రణలోకి వస్తాయట. తులసిలో ఉండే ఔషద గుణాలు జీవక్రియను మెరుగుపరచడం వల్ల ఇది సాద్యమవుతుందని  అంటున్నారు. తులసి టీ తయారు విధానం.. టీ అనగానే బారతీయులకు పాలు, పంచదార వేసి చేసే పానీయం గుర్తు వస్తుంది.  కానీ తులసి టీ తయారు చేయడానికి పాలు అవసరం లేదు. కావలసిన పదార్థాలు.. తులసి ఆకులు.. నీరు తేనె నిమ్మరసం తయారు విధానం.. ఒక గ్లాసు నీటిలో 5 నుండి 7 తులసి ఆకులు వేయాలి.  దీన్ని బాగా మరిగించాలి.  మరిగిన తరువాత వడపోసుకోవాలి.  ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ నిమ్మరసం,  ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. తేనె,  నిమ్మరసం వేయకపోయినా పర్వాలేదు.  తులసిని నీళ్లలో మరిగించి తాగవచ్చు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

కత్తి లాంటి కంటి చూపుకు అమేజింగ్ డ్రింక్ ఇది..!

  సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అన్ని అవయవాలలోకి కళ్లు చాలా ముఖ్యమైనవి. కంటిచూపు మెరుగ్గా ఉంటే జీవితంలో చాలా భాగం చాలా సవ్యంగా గడిచిపోతుంది. కానీ నేటి కాలంలో కంటిచూపు సమస్యలు చాలా ఎక్కువ ఉంటున్నాయి.  చిన్న పిల్లల నుండి ప్రతి ఒక్కరూ కళ్ల అద్దాలు ఉపయోగించడం, కంటి సంబంధ సమస్యలతో ఇబ్బంది పడటం చేస్తుంటారు. చాలామంది కంటి చూపు మెరుగవ్వడం కోసం సప్లిమెంట్లు కూడా తీసుకుంటూ ఉంటారు.  కానీ సంప్లిమెంట్లు అక్కర్లేకుండా కంటి చూపు కత్తిలా, పదునుగా మార్చే అద్బుతమైన డ్రింక్ ఒకటుంది.  ఈ డ్రింక్ ను తీసుకుంటే కంటి అలసట తగ్గడంతో పాటు కంటి శుక్లం సమస్య కూడా తగ్గుతుందని చెబుతున్నారు.  ఈ డ్రింక్ ఏంటో.. ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో.. ఈ డ్రింక్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. జామాకు టీ.. జామకాయ రుచికరమైన పండు మాత్రమే కాదు, దాని ఆకులలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. జామ ఆకులతో తయారుచేసిన టీ కంటి చూపును మెరుగుపరచడానికి,  కంటి చూపు జాగ్రత్తగా ఉండటానికి చాలా సహాయపడుతుంది. జామాకులలో పోషకాలు..  జామాకులలో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు,  అనేక ఇతర పోషకాలు ఉంటాయి.  ఇవి  కళ్ళకు పోషణ ఇస్తాయి.  కంటి అలసటను తగ్గిస్తాయి.  కంటిశుక్లం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. జామాకు టీ తయారీ విధానం.. తాజాగా ఉన్న ఆకుపచ్చ జామ ఆకులను తీసుకొని వాటిని బాగా కడిగి, దుమ్ము, రసాయనాలు వాటి మీద నుండి తొలగించాలి.  ఒక పాన్‌లో రెండు నుండి మూడు కప్పుల నీటిని మరిగించాలి. నీరు మరిగిన తర్వాత, జామ ఆకులను నీటిలో వేయాలి. ఆకులలోని  పోషకాలు నీటిలో చేరతాయి. సుమారు   7-8 నిమిషాలు తక్కువ వేడి మీద మరిగించాలి. ఆ తరువాత స్టౌ ఆప్ చేసి వడగట్టాలి.  గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.  ఇందులో రుచి కోసం తేనె, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. జామాకు టీ ఇందుకే బెస్ట్.. జామ ఆకులలో  విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.  ఇది  రెటీనాను బలపరుస్తుంది.  రేచీకటి వంటి  కంటి   సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. జామాకు టీ  కళ్ళను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. తద్వారా కంటిశుక్లం,  వయస్సు సంబంధిత కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటి అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది .  ఎక్కువసేపు స్క్రీన్ వైపు చూడటం వల్ల కంటి అలసట,  పొడిబారడం జరుగుతుంది. జామాకు  టీ దీనిని తగ్గించడంలో సహాయపడుతుంది. కళ్ల వాపు,  ఎరుపు నుండి ఉపశమనం. దీనిలో ఉన్న శోథ నిరోధక లక్షణాలు కళ్ళ ఎరుపు,  చికాకును తగ్గిస్తాయి . రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  జామాకు టీ  కళ్ళకు ఆక్సిజన్,  పోషకాల సరఫరాను మెరుగుపరుస్తుంది. దీని వలన కంటిచూపులో స్పష్టత పస్తుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ప్రయాణాల్లో చాలా ఇబ్బంది పెట్టే మలబద్దకం సమస్యకు చెక్ పెట్టండి ఇలా..!

కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్..  ఇట్లా  ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది.  చాలా వరకు ఆఫీసు పనులు, వ్యక్తిగత పనుల మీద ఒంటరిగానే ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిజానికి ప్రయాణాలు అంటే అదొక స్పెషల్ మూమెంట్ అనిపిస్తుంది.  కానీ చాలా మంది మాత్రం ప్రయాణంలో చెప్పుకోలేని అసౌకర్యం అనుభవిస్తుంటారు.  అదే మలబద్దకం. ప్రయాణం కోసం అలా ఇంటి నుండి బయటపడగానే.. ఇటు మలబద్ధకం, ఉబ్బరం, తిమ్మిర్లు,  అసౌకర్యం మొత్తం ప్రయాణాన్ని నాశనం చేస్తాయి. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు  ఈ సమస్య నరకాన్ని పరిచయం చేస్తుంది. అసలు ప్రయాణాలలో మలబద్దకం ఎందుకు వస్తుంది.  ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలేంటి తెలుసుకుంటే.. ప్రయాణాల సమయంలో మలబద్దకం ఎందుకు వస్తుంది? ప్రయాణాలు చేసేటప్పుడు దినచర్య మారడం,  ఆహారపు అలవాట్లలో మార్పులు,  నీరు తక్కువ తీసుకోవడం,  ఎక్కువ సేపు కూర్చోవడం,  నిద్రలేకపోవడం,  టాయిలెట్ కు వెళ్లడానికి తగిన వెసులుబాటు లేకపోవడం మొదలైనవి మలబద్దకం రావడానికి కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రయాణాల సమయంలో మలబద్దకం,  ఉబ్బరం,   గ్యాస్ వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కుంటారు. ముఖ్యంగా వృద్దులు, స్త్రీలు,  పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ప్రయాణ సమయంలో మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టే చిట్కాలు.. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టాలంటే ప్రయాణాలలో ఫైబర్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  మరీ ముఖ్యంగా ప్రయాణాలలో హోటల్ ఆహారాన్ని నిషేధించాలి. ప్రయాణాలలో ఆహారం వల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పండ్లను తినడం మంచిది. పండ్లలో ఫైబర్ ఉంటుంది, నీటి శాతం కూడా ఉంటుంది.  ఇది జీర్ణాశయానికి సహాయపడుతుంది. ప్రయాణాలలో ఆకలి వేయకపోయినా స్నాక్స్ తినే అలవాటు కొందరికి ఉంటుంది.  బిస్కెట్లు,  సమోసాలు వంటివి తినడం వల్ల మలబద్దకం వస్తుంది.  అందుకే వీటిని నివారించాలి.  ఆకలిగా అనిపిస్తే బాదం, కాజు వంటి శక్తిని ఇచ్చే నట్స్ తీసుకోవాలి. ప్రయాణాలలో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. కానీ ప్రయాణాలలో తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా అటు ఇటు తిరగడం,  ఏవైనా స్టాప్ లు వచ్చినప్పుడు కిందకు దిగి మళ్లీ ఎక్కడం వంటివి చేయవచ్చు. ప్రయాణాలలో తప్పనిసరిగా బయటి ఆహారం తినాల్సి వస్తే ప్రోబయోటిక్స్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  దోశ, ఇడ్లీ,  మజ్జిగ, పెరుగన్నం వంటివి మలబద్దకం రాకుండా చేస్తాయి. అలాగే ప్రయాణంలో పాలు పోక ఊరికే కాఫీలు,  టీలు తాగడం మానేయాలి. ప్రయాణాలలో మలబద్దకం సమస్యను ఎదుర్కునేవారు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఇలా సమస్య ఎదుర్కునేవారు వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడటం మంచిది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఏ సీజన్ లో అయినా పొట్ట సమస్యలకు చెక్ పెట్టే అమృతం ఇది..!

పొట్ట కాస్త తేడా కొడితే చాలు.. ఎంత బలంగా, దృఢంగా ఉన్న మనిషి అయినా  అసౌకర్యానికి లోనవుతారు.  పొట్ట ఆరోగ్యం బాగుంటే మిగతా శరీరం ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. కానీ పొట్ట ఆరోగ్యం తేడా వస్తే తిండి, నీరు తీసుకోవడం కూడా  బ్రేక్ పడుతుంది.  ఇలా పొట్ట, ప్రేగు ఆరోగ్యాన్నే గట్ అని పిలుస్తారు. శరీరం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడే ఆరోగ్యకరమైన బాక్టీరియా తయారయ్యేది పొట్టలోనే.. అలాంటప్పుడు పొట్ట ఆరోగ్యం బలంగా ఉండటం ఎంతో  అవసరం.  పొట్ట ఆరోగ్యం బాగుండాలన్నా,  పొట్ట సమస్యలు ఏ సీజన్ లో వచ్చినా వాటికి చెక్ పెట్టాలన్నా కేవలం ఒక్క పానీయం అమృతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  అదేంటో  తెలుసుకుంటే.. మజ్జిగ.. శీతాకాలంలో తరచుగా మజ్జిగ, పెరుగుకు దూరంగా ఉంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ప్రతి సీజన్‌లో కడుపు సమస్యలకు చెక్ పెట్టడంలో మజ్జిగ చాలా  ప్రయోజనకరంగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనంతో పాటు ప్రతిరోజూ మజ్జిగ  తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు తగ్గుతాయి.  జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇదే అసలైన మజ్జిగ.. మజ్జిగ ఈనాటి పానీయం కాదు.. దీనికి ఎంతో చరిత్ర ఉంది. పెరుగు చిలికిన తర్వాత తయారుచేసిన మజ్జిగ ఎప్పుడూ ఆరోగ్యకరమైనది. చాలామంది వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగుతారు.  కానీ శీతాకాలం వచ్చేసరికి పెరుగు, మజ్జిగ వాడకం తగ్గిస్తారు.  అయితే ఆయుర్వేదం ప్రకారం ఇది ప్రతి సీజన్ లో శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. జీర్ణక్రియను బలంగా ఉంచుతుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. మజ్జిగ ఇలా తాగాలి.. చాలామంది పెరుగులో నీళ్లు కలిపి పలుచగా చేసుకుని దాన్నే మజ్జిగ అనుకుంటారు. కానీ నిజానికి మజ్జిగ అనేది పెరుగులో వెన్న తొలగించిన తరువాత లభించే ద్రవం. ఈ మజ్జిగలో అస్సలు ఫ్యాట్ ఉండదు.  ఈ మజ్జిగను నేరుగా అలాగే తాగవచ్చు.  లేదా అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పొడి వంటివి కలిపి కూడా తాగవచ్చు.  అలా కాకున్నా ప్లెయిన్ మజ్జిగలో కాసింత నిమ్మరసం, జీలకర్ర పొడి కలుపుకుని తీసుకున్నా జీర్ణశక్తి బలంగా ఉంటుంది.   మజ్జిగ బెస్ట్ ఎందుకంటే.. మజ్జిగలో కాల్షియం, ప్రోబయోటిక్స్,  ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపు ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.  జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. భోజనం తర్వాత బరువుగా, గ్యాస్ లేదా ఉబ్బరం ఉన్నవారికి మజ్జిగ ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి జోడించిన రాతి ఉప్పు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది.  వేయించిన జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  నల్ల మిరియాలు కడుపు వాయువును తగ్గించి కడుపును తేలికపరుస్తుంది.                                      *రూపశ్రీ.

 ప్రతి రోజు ఒక కప్పు దానిమ్మ రసం తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజూ ఆహారంలో పండ్లు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అయితే కొన్నిరకాల పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  ముఖ్యంగా దానిమ్మ రసం చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రోజూ ఒక కప్పు దానిమ్మ (pomegranate) రసం తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరతాయి. ఇది శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచే సహజ ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే.. గుండె ఆరోగ్యానికి మంచిది.. రక్తనాళాలను శుభ్రపరిచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. గుండెపోటు, హై బీపీ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్.. దానిమ్మలో పునికాలగిన్స్ (punicalagins) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, క్యాన్సర్, వృద్ధాప్యం రాకుండా రక్షిస్తాయి. శరీరానికి నష్టం కలిగించే హానికరమైన కణాలతో పోరాడతాయి. రక్తహీనత (అనీమియా) నివారణ.. దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్ లో కూడాఐరన్ అధికంగా ఉంటుంది.  ఈ కారణం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. రక్తహీనత సమస్య తో ఇబ్బంది పడేవారు,  ముఖ్యంగా మహిళలు దానిమ్మ రసం రోజూ తీసుకుంటే మంచిది.  ఇంకా దానిమ్మ జ్యూస్  రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మవర్ణం మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక శక్తి.. దానిమ్మలో విటమిన్ C, విటమిన్ K, పొటాషియం అధికంగా ఉంటాయి.  ఇవి   ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మ ఆరోగ్యం,  అందం.. దానిమ్మ జ్యూస్ రోజూ తాగుతూ ఉంటే చర్మం గ్లోగా, యంగ్‌గా కనిపించేందుకు సహాయపడుతుంది.  అలాగే చర్మం మీద మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహకరిస్తుంది. మూత్రపిండాలకు & కాలేయానికి శుభ్రత.. టాక్సిన్లను బయటకు పంపి లివర్‌ను డిటాక్స్ చేయడంలో దానిమ్మ బాగా పనిచేస్తుంది. అంతేకాదు  మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడం & బరువు తగ్గడం.. దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా దానిమ్మ పండు లేదా జ్యూస్ తీసుకుంటే   త్వరగా ఆకలి కాదు.   మితంగా తీసుకుంటే బరువు తగ్గే వారికీ సహాయకరంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన  రసం తీసుకోవడం మంచిది.  ప్యాకెట్ జ్యూస్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ చేస్తుంది.  డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. రోజూ 1 కప్పు (150–200 మిల్లీలీటర్లు) సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

కిడ్నీలను డేంజర్ లో పడేసే క్రియేటినిన్..!

  సాధారణంగా ఏదైనా అనారోగ్యం వల్ల డాక్టర్ చెకప్ చేయించుకున్నప్పుడు చాలామంది కిడ్నీ టెస్ట్ కూడా చేయించుకుంటారు.  ఈ సందర్భంలో కొందరిలో క్రియేటినిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు బయటపడుతుంటుంది.  క్రియేటినిన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో విషపదార్థాలు ఎక్కువగా పేరుకుపోవడానికి దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అసలు కియేటినిన్ అంటే ఏంటి? ఇది ఎక్కువ స్థాయిలో ఉంటే కిడ్నీలు ఎందుకు డేంజర్ లో పడతాయి.  దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే.. క్రియాటినిన్ అంటే.. క్రియాటినిన్ అనేది కండరాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం. ఈ క్రియాటినిన్ ను మూత్రపిండాలు సులువుగానే ఫిల్టర్ చేస్తాయి. అయితే దీనికి కూడా ఒక పరిమితి ఉంది.  ఈ పరిమితికి మించి క్రియాటినిన్ అనేది ఉత్పత్తి అయితే మూత్రపిండాల పనితీరు మీద ప్రబావం చూపిస్తుంది. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల మూత్రపిండాలలో విష పదార్థాలు పేరుకుపోయి మూత్రపిండాల మీద ఒత్తిడి పెరుగుతుంది. క్రియాటినిన్ ఎలా పెరుగుతుంది? మానవ శరీరంలో క్రియేటిన్ అనే సమ్మేళనం విచ్చిన్నం కావడం ద్వారా క్రియేటినిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది కండరాలకు శక్తిని అందించడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఉన్నప్పుడు మూత్రపిండాలు దీన్ని సులువుగా ఫిల్డర్ చేసి, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడతాయి. అయితే గాయం, ఇన్పెక్షన్, మధుమేహం, అదిక రక్తపోటు, మందుల దుష్ప్రభావాల వల్ల మూత్రపిండాలు ప్రభావితం అయినప్పుడు రక్తంలో క్రియేటినిన్ స్థాయిలు పెరుగుతాయి. కొన్నిసార్లు శరీరం డీహైడ్రేషన్ కు లోను కాపడం,  అధికంగా ప్రోటీన్ తీసుకోవడం, కఠినమైన వ్యాయామాలు చేయడం లేదా కొన్ని మందులు.. మొదలైనవి క్రియేటినిన్ ను పెంచుతాయి. క్రియేటినిన్ స్థాయి.. సాధారణంగా క్రియేటినిన్ స్థాయి 0.6-1.3m/dl వరకు ఉంటుంది.  ఇది మగవారిలో కొంచెం ఎక్కువ ఉంటుంది.  స్త్రీలలో కండర ద్రవ్యరాశిని బట్టి కొంచెం తక్కువగా ఉంటుంది. క్రియేటినిన్ పెరిగితే కనిపించే లక్షణాలు.. రక్తంలో క్రియేటినిన్ పెరిగితే ఎప్పుడూ అలసటగా ఉండటం, కాళ్లలో వాపు, ఊపిరి ఆడకపోవడం,  మూత్ర విసర్జనలో మార్పులు, తలనొప్పి,  కంటి చూపు మసకబారటం, నడుము దిగువ భాగంలో నొప్పి మొదలైన లక్షణాలు శరీరంలో క్రియేటినిన్ స్థాయిలు పెరిగాయనడానికి సంకేతాలు. మూత్రపిండాల మీద ఒత్తిడి పెరిగితే ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. క్రియేటినిన్ స్థాయిలను మొదట్లోనే గుర్తించగలిగితే కిడ్నీల  ఆరోగ్యం కాపాడుకోవడానికి వీలవుతుంది. క్రియేటినిన్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది.. శరీరంలో క్రియేటినిన్ స్థాయిలను ముందుగానే గుర్తించి, వైద్యం తీసుకోగలిగితే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ క్రియేటినిన్ ను గుర్తించకుండా అలాగే ఎక్కువ రోజులు కొనసాగితే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, మూత్రపిండాల వైఫల్యం,  గుండె సమస్యలు,  ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి తీవ్రమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. క్రియేటినిన్ పెరకకూడదంటే ఏం చేయాలి? క్రియేటినిన్ పెరగకూడన్నా, క్రియేటినిన్ ను మూత్రపిండాలు సమర్థవంతంగా ఫిల్టర్ చేయాలన్నా నీరు పుష్కలంగా తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. ప్రోటీన్, ఉప్పు నియంత్రణలో తీసుకోవాలని, మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉంటే వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలని కూడా వైద్యులు చెబుతున్నారు.  అదే విధంగా వైద్యుల సలహా లేకుండా మందులు, ముఖ్యంగా మూత్రపిండాలను ప్రభావితం చేసే మందులు అస్సలు వాడకూడదు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...