Read more!

చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ ప్రసంగం

 

కేంద్రమంత్రి చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్ భార్య శ్రీజతో విడిపోయిన తరువాత, ఆమె ఆయనపై పోలీసు స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు కూడా నమోదుచేసినట్లు ఆ మద్యన వార్తలు వచ్చాయి. అయితే, ఆ తరువాత ఆ కేసు కధ ఏమయిందో గానీ, శిరీష్ చాలారోజులుగా బయట ఎక్కడా కనబడలేదు. శిరీష్ కధ ఇక ముగిసిపోయినట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఆకాశం లోంచి ఊడిపడినట్లు వచ్చి కొద్ది రోజుల క్రితమే బీజేపీలోచేరిపోయారు.

 

మళ్ళీ మద్యలో కొంత విరామం తరువాత ఈ మద్యనే హైదరాబాదులో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొని, తొలి రాజకీయ ప్రసంగం కూడా చేసారు. ఆయన ప్రసంగం అనగానే చిరంజీవిని తిట్లు లంకించుకొంటారని, చిరంజీవిపై విసుర్లు ఉంటాయని అందరూ ఆశించడం సహజం. కానీ, ఆయన తన మొట్టమొదటి ప్రసంగాన్ని కేవలం బీజేపీ అధిష్టానాన్ని భజన చేయడానికే అంకితం చేసేయడంతో కార్యకర్తలు కొంచెం నిరాశకు గురయారని సమాచారం. తనవంటి యువతకు రాజకీయాలలో చేరెందుకు చక్కటి అవకాశం కల్పించిన బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపి, నరేంద్ర మోడీ ఒక సమర్దుడయిన నాయకుడని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేసారు. చప్పగా సాగిన ఈ చిరనజీవి చిన్నల్లుడి ప్రసంగం చూసిన కార్యకర్తలు, ‘ఈయన కూడా మామగారిలాగే ఆచితూచి మాట్లాడితే ఎవరు వింటారు’ అని గొణిగారుట.