Read more!

'నిర్భయ'కు స్త్రీ శక్తి పురస్కారం

 

 

 

 

ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కు గురై ప్రాణాలు కోల్పోయిన వైద్య విద్యార్ధిని 'నిర్భయ'ను స్త్రీ శక్తి పురస్కారంతో గౌరవించనున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఆమె చూపిన తెగువ, ఆత్మస్థైర్యాన్ని కి నివాళిగా మరణాంతరం ఈ అవార్డ్ ను అందజేయనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ చేతులు మీదుగా 'నిర్భయ' ఫ్యామిలీ ఈ అవార్డు ను స్వికరించనున్నారు.

 

ప్రతి సంవత్సరం అసాధారణ మహిళలకు ఇచ్చే స్త్రీ శక్తి పురస్కారాన్ని 'నిర్భయ'కు ఇవ్వాలని మహిళ, శిశుసంక్షేమ మంత్రిత్వశాఖ బావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ''మానవ మృగాలతో పోరాటంలో 'నిర్భయ' అసాధారణ తెగువను ప్రదర్శించారు. ఆమె దేశంలో చైతన్య జ్వాలను రగిలించింది'' అని వివరించాయి. ప్రభుత్వం జాతీయ అవార్డులను స్త్రీ శక్తి పురస్కారాల కింద ప్రధానం చేస్తుంది. వీటిలో ఝాన్సీ లక్ష్మిభాయి అవార్డును నిర్భయ కు ప్రధానం చేస్తారు.