మెట్రోపనులను అడ్డుకుంటున్న సుల్తాన్ బజార్ ట్రేడర్స్
posted on Jul 5, 2012 @ 7:08PM
హైదరాబాద్‌నగరంలో శరవేగంతో సాగుతున్న మెట్రోపనులకు ఆటంకం కలిగే ప్రమాదం ఏర్పడిరది. సుల్తాన్ బజార్‌లో మెట్రోరైలు పనులు ప్రారంభిస్తే తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని సుల్తాన్‌బజార్ ట్రేడర్స్ జాయింట్ యాక్షన్ కమిటి హెచ్చరిస్తోంది. మెట్రోరైలుఅధికారుల ఆఫీసులు , ఇండ్లు ముట్టడిస్తామని బెదిరిస్తోంది..
ఇటీవలికాలంలో ఎల్ ఎండ్ టీ హైదరాబాద్ మేనేజర్ విబి గాడ్గిల్ చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన దిష్ఠిబొమ్మను ఆంధ్రబ్యాంకు చౌరస్తాలో దహనంచేశారు. మెట్రోకారిడార్ 2 నిర్మాణకార్యక్రమాలను వేగవంతం చేయనున్నట్లు గాడ్గిల్ చేసిన ప్రకటనపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మార్కెట్‌ను నమ్ముకొన్న వందలాదిమంది వ్యాపారులు ,సిబ్బంది వీధిన పడతారని ఆందోళన వ్యక్తంచేశారు. జూబ్లీబస్ స్టేషన్‌నుండి ఫలక్‌నామావరకు వేయనున్న మెట్రోరైలు కారిడార్ 2 నిర్మాణపు పనులను వెంటనే ఆపివేయాలని సుల్తాన్ బజార్ ట్రేడర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ కోరారు. డిల్లీ బెంగుళూరు వంటి నగరాల్లో వేసిన మెట్రోరైలు మార్గం అవసరాన్ని బట్టి భూగర్బంనుండి వెళ్లేలా అక్కడి అధికారులు చర్యలు తీసుకున్న విషయం గాడ్గిల్ గుర్తుంచుకోవాలన్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టయినా మెట్రోరైలు నిర్మాణాలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.