పరాఠాలు అంటే ఇష్టమా? దయచేసి స్టఫింగ్ కు ఇవి మాత్రం వాడకండి..!
posted on Jul 24, 2025 @ 9:30AM
భారతీయులకు పరాఠాలు, రోటీలు అంటే చాలా ఇష్టం. చాలా ఇళ్ళలో పూరీలు, స్టఫ్డ్ చేసిన పరాఠాలు చాలా సాధారణం. బంగాళాదుంపలు, పనీర్, జున్ను, మాంసం.. ఇట్లా చాలా పదార్థాలు పరాఠాల స్టఫింగ్ లో వాడతారు. పరాఠా రుచి ఇనుమడించడం కోసం చాలా రకాలుగా పరాఠాలు చేస్తుంటారు. కానీ ఇట్లా పరాఠాలు చేయడం అన్ని విదాలుగా ఆరోగ్యకరమైనది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల పదార్థాలు స్టఫ్ చేసి పరాఠాలు తయారు చేసుకుని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా పెరుగుతుందట. అలాగే ఊబకాయం కూడా సందేహం లేకుండా వస్తుంది అంటున్నారు. ఇంతకీ పరాఠాలలో స్టఫ్ చేయకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుంటే..
ప్రాసెస్డ్ చీజ్ లేదా మయోనైస్..
ఈ రోజుల్లో చీజ్ పరాఠాలు లేదా మాయో స్టఫ్డ్ రోల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ ప్రాసెస్ చేసిన వస్తువులలో సంతృప్త కొవ్వులు, రసాయన ప్రజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
సరిగ్గా ఉడికించని మాంసం లేదా కీమా..
పూర్తిగా ఉడికించకుండా ముక్కలు చేసిన మాంసం లేదా మటన్‌తో నింపితే అది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది. సరిగ్గా ఉడికించని మాంసం బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. గ్యాస్, వాంతులు, విరేచనాలు వంటి కడుపు సమస్యలను కలిగిస్తుంది.
ఎక్కువ నూనెతో సుగంధ ద్రవ్యాలు..
బంగాళాదుంపలు, ఉల్లిపాయలు లేదా ఏదైనా కూరటానికి ఎక్కువ నూనె, సుగంధ ద్రవ్యాలు జోడించిన పదార్థాలు స్టప్ చేస్తే అది కడుపు జీర్ణ శక్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఆమ్లతత్వం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
మిగిలిన కూరలు లేదా కూరగాయలు..
చాలా మంది మిగిలిపోయిన కూరగాయలను పరాఠాలలో ఉపయోగిస్తారు, కానీ ఏమైనా కాస్త పాడైన కూరగాయలు శరీరంలో విషాన్ని కలిగిస్తాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ లకు దారితీస్తాయి.
అధిక ఉప్పు లేదా ఊరగాయ..
కొంతమంది ఊరగాయ లేదా ఎక్కువ ఉప్పు జోడించడం ద్వారా పరాఠా రుచిని పెంచాలని కోరుకుంటారు. కానీ ఊరగాయలో ఉండే అధిక ఉప్పు కంటెంట్ కడుపులో చికాకు, ఆమ్లతత్వం, అధిక రక్తపోటు వస్తుంది. అధిక ఉప్పు గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..