కన్నీరుమున్నీరవుతోన్న సిద్దరామయ్య ఫ్యామిలీ
posted on May 13, 2023 @ 1:27PM
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. హస్తం పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. ఆ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు ఆనందడొలికల్లో మునిగి తేలుతోన్నాయి. అలాగే కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య కుటుంబం కూడా విజయనందంలో ఉంది. అలాంటి వేళ... సిద్దరామయ్య సోదరి శివమ్మ భర్త రామేగౌడ కొద్ది సేపటి క్రితం మరణించారు. దీంతో ఆయన ఇంట విషాద ఛాయలు అలముకొన్నాయి. ఈ రోజు ఉదయం రామేగౌడ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని మైసూర్‌లోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో.. సిద్దరామయ్య కుటుంబంలో విషాదం చాయలు అలుముకొన్నాయి. రామేగౌడ ఆరోగ్యం మెరుగు పడి క్షేమంగా ఇంటి వస్తారని.. కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగడంపై సిద్దరామయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళ్లడంపై సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకొంటుందని.. ఈ నేపథ్యంలో తన తండ్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రయోజనాల కోసం తన తండ్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలని... ఒక కుమారుడిగా తన తండ్రిని సీఎంగా చూడాలని అనుకుంటున్నానని చెప్పారు.