సిద్ద రామయ్య కొడుకు మృతికి.. కాకికి లింకేంటి..?
posted on Jul 30, 2016 @ 6:32PM
కొన్నిసార్లు మనకి చెడు జరుగుతుందో లేదో పక్కన పెడితే కొన్ని నమ్మకాల్ని పాటిస్తాం. అందులో నిజం ఎంతుందో మనకి తెలియదు. అనాదిగా వస్తున్న ఆచారాలు కాబట్టి పాటిస్తే పోయేదేముంది అని అనుకుంటాం. అయితే కొంత మంది మాత్రం ఇవన్నీ ట్రాష్ అని అనుకుంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం కాకిని అశుభసూచకంగా భావిస్తారు. ఈ కారణంగానే అది ఇంటి పరిసరాల్లో వాలడానికి ప్రయత్నిస్తే తరిమి కొడతారు. ఇళ్లలోకి కాకి వచ్చినా, వాహనాలపై వాలిన దాన్ని చెడుకు సంకేతంగానే భావిస్తారు. ఇప్పుడు ఈ కాకి గోల ఏంటబ్బా అని అనుకుంటున్నారా..?అక్కడే ఉంది ట్విస్ట్ అంతా. ఇప్పుడు ఈ కాకి మేటరే పెద్ద హాట్ టాపిక్ అయింది.
ఎందుకంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ సిద్ధరామయ్య ఈ రోజు అనారోగ్యం కారణంగా మరణించారు. గత కొద్దిరోజుల క్రితం బెల్జీయం వెళ్లిన ఆయన మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ప్రాణాలు వదిలారు. అయితే ఇప్పుడు ఈయన మృతికి కాకికి లింక్ పెడుతున్నారు కొంతమంది. అసలు సంగతేంటంటే.. కొద్ది రోజుల క్రితం సిద్ద రామయ్య కారుపై కాలి వాలిందన్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై అప్పుడు వార్తలు కూడా హల్ చల్ చేశాయి. ఇంకా కాకి వాలినందుకు అప శకునంగా భావించి సిద్ద రామయ్య కారును కూడా మార్చేసి కొత్త కారును తీసుకున్నారు. ఇప్పుడు సిద్ద రామయ్య కొడుకు మృతి చెందడంతో కాకి అపశకునమని చెప్పడానికి ఇదే నిదర్శనమని కొంతమంది అంటున్నారు. మొత్తానికి అది నిజమో..కాదో తెలియదు కానీ.. సిద్ద రామయ్యకు మాత్రం కొడుకు మరణంతో హాని జరిగింది.