మైనర్‌ని పెళ్ళాడనున్న క్రికెటర్ అఖ్తర్
posted on Jun 7, 2014 @ 4:44PM
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వయసు దాదాపు 40 సంవత్సరాలు. ఈ లేటు వయసులో ఈయనగారు పెళ్ళి చేసుకోబోతున్నారు. ఆ పెళ్ళికూతురు వయసెంతో తెలిస్తే మీరు ఆశ్చర్యంతో నోరు నొక్కుకుంటారు. అఖ్తర్‌కి ఈ పోయేకాలమేంటని తిట్టుకుంటారు. అఖ్తర్ పెళ్ళాడబోయే అమ్మాయి వయసు అఖ్తర్ వయసులో సగం కంటే తక్కువ. అంటే ఆ అమ్మాయి వయసు కేవలం 17 సంవత్సరాలు. అంటే మైనర్. ఇండియాలో మైనర్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే లోపలేస్తారు. పాకిస్థాన్‌లో ఆ చట్టం వున్నట్టు లేదు. పాకిస్థాన్‌లోని హరిపూర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ముస్తక్ ఖాన్ కుమార్తె అయిన పదిహేడేళ్ళ రుబబ్తో షోయబ్ పెళ్లి నిశ్చయమైంది. ప్రముఖ క్రికెటర్ సంబంధం దొరికిందన్న ఆనందంలో రుబబ్ తండ్రి వధూవరుల వయసులను ఎంతమాత్రం పట్టించుకోకుండా పెళ్ళి జరిపించడానికి ఒప్పుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ నెల మూడో వారంలో అఖ్తర్, రుబబ్ వివాహం జరగనుంది. పాపం రుబబ్!