మోడీ విషయంలో తొందరొద్దు: థరూర్‌కి డిగ్గీ సూచన
posted on Jun 7, 2014 @ 4:34PM
వినేవాడికి చెప్పేవాడెప్పుడూ లోకువే అన్నట్టు ఇప్పుడు శశిథరూర్ దిగ్విజయ్‌సింగ్‌కి లోకువైపోయాడు. దిగ్విజయ్‌సింగ్‌కి తనకు, టీవీఛానల్ యాంకర్‌కూ మధ్య వున్న రిలేషన్ విషయంలో క్లారిటీ లేదుగానీ, శశిథరూర్‌కి సలహాలిస్తున్నాడు. అమెరికాలోని ఓ వెబ్‌సైట్‌కి శశిథరూర్ రాసిన వ్యాసంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని పొగిడాడు. అది కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వుండి వీలైతే నరేంద్రమోడీని తిట్టాలిగానీ, పొగడ్డమేంటని చాలామంది కాంగ్రెస్ నాయకులు ఫీలయ్యారు. మణిశంకర్ అయ్యర్ అయితే శశిథరూర్‌ని ఏకంగా ఊసరవెల్లితో పోల్చాడు. ఇదిలా వుంటేఈ విషయంలో శశిథరూర్ అడక్కపోయినా డిగ్గీరాజాకి సలహా ఇవ్వాలని అనిపించినట్టుంది. వెంటనే ఇచ్చేశాడు. ‘‘ప్రధాని నరేంద్రమోడీ విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి, అభిప్రాయానికి రావొద్దు. కొంతకాలం గడిచిన తర్వాతే, మోడీ మరో అవతారం బయట పడిన తర్వాతే ఒక అభిప్రాయానికి రావాలి’’ అన్నట్టుగా శశిథరూర్‌కి ఉచిత సలహా ఇచ్చాడు. ఇదిలా వుంటే మోడీపై తన వ్యాఖ్యల పైన థరూర్ వివరణ ఇచ్చాడు. ఇప్పుడు మోడీని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యల్లాగే గతంలో ఆయనను విమర్శిస్తూ చేసిన ప్రతి వ్యాఖ్యకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని, భవిష్యత్తులో ఆయన చర్యలను గమనిస్తూ ఉంటామని థరూర్ గురువారం ట్విట్టర్‌లో ట్విట్ చేశాడు.