సానియాతో విడాకులపై షోయబ్ స్పందన.. అంతరార్ధమేమిటి?
posted on Dec 11, 2022 @ 11:12AM
ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియామీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహ బంధానికి చెల్లుచీటీ ఇచ్చేస్తున్నారన్న వార్తలపై ఇప్పటి వరకూ ఇరువురూ పెదవి విప్నని సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా సానియా, షోయబ్ జంట విడిపోనున్న వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమౌతున్నాయి.
అయితే ఈ వార్తల పట్ల ఇంత వరకూ ఇరువురిలో ఎవరూ స్పందించకపోవడంతో చాలా మంది ఇరువురూ విడాకులకు సిద్ధమయ్యారనే నమ్ముతూ వచ్చారు. అయతే తాజాగా షోయబ్ మాలిక్ విడాకుల విషయంలో స్పందించాడు. సానియాతో విడాకుల విషయంపై మీడియా ముఖంగా ఒకింత అసహనం వ్యక్తం చేసిన షోయబ్ మాలిక్.. అది మా వ్యక్తిగత విషయం అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా తాను కానీ తన భార్య కానీ ఇప్పటి వరకూ ఈ విషయంలో స్పందించలేదని చెప్పిన షోయబ్ మాలిక్ ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయమని మీడియాకు సూచించాడు.
అయితే షోయబ్ మాలిక్ స్పందన తరువాత కూడా సానియాతో అతడు విడిపోతున్నాడా.. లేదా అన్న విషయంపై స్పష్టత రాలేదు. దీంతో వీరిరువురి విడాకులు ఖాయమన్న వార్తలు జోరందుకున్నాయి. సానియా–షోయబ్ విడిపోయారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలి కాలంలో ఈ ప్రచారం ఎక్కువైంది. పైగా సానియా తన సోషల్ మీడియా ఖాతాలో చేస్తున్న పోస్టులు ఈ ప్రచారానికి తావిస్తున్నాయి.
సానియా తన భర్త ఫొటో లేకుండానే ఫొటోల్ని షేర్ చేస్తోంది. అలాగే సానియా సన్నిహితులు కూడా వాళ్లిద్దరూ ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ఎప్పటి నుంచో విడిగా ఉంటున్నారని చెబుతున్నారు. కాగా, సానియా మీర్జా–పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్లు దుబాయ్‌లో ఉంటున్నారు.