హాట్ బ్యూటి పొలిటికల్ కామెంట్స్
posted on Aug 3, 2013 @ 11:48AM
కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయపార్టీలు ఆడుతున్న రాజకీయ చదరంగంతో రాష్ట్ర రాజకీయాల పరిస్థితి అద్వనంగా తయారైంది. బాధ్యులు బాధితులే కాదు ఇక్కడి పరిస్థితులతో ఎలాంటి సంబందంలేని వారు.. కనీస అవగాహన కూడా లేనివారు ఆంద్రప్రదేశ్ గురించి మాట్లాడేస్తున్నారు.
కేవలం తన కామెంట్స్‌తోనే పబ్లిసిటీ కావాలని ఆశపడే షెర్లిన్ చోప్రా మరోసారి తన నోటికి పని చెప్పింది. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అందరూ చెర్చించుకుంటున్న తెలంగాణ ఇష్యూపై తన అభిప్రాయాన్ని చెప్పింది.
హాట్ స్టార్‌గా బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న షెర్లిన్ చోప్రా ఎ ఫిల్మ్ బై అరవింద్ అనే తెలుగు సినిమాలో నటించింది. కాని తరువాత ఎప్పుడు ఆంద్రప్రదేశ్ వంక కన్నెత్తి కూడా చూడని షెర్లిన్ ఇప్పుడు రాష్ట్ర విభజనపై కామెంట్ చేసింది.
కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే దానికి కావాల్సిన ఖర్చు ఎవరు భరిస్తారన్న షెర్లిన్ ఇలాంటి రాజకీయాలపై తిరగబడాలని పిలుపునిచ్చింది. షెర్లీన్ కామెంట్స్ మంచిదే అని కొంత మంది అంటున్నా తన పని తానూ చూసుకుంటే బెటర్ అనే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.