విభజన విషయం చిరుకు ముందే తెలుసా..?
posted on Aug 3, 2013 @ 12:24PM
రాష్ట్రంలో విభజన సెగలు తారా స్థాయికి చేరుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అందరూ ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉంది. నిజంగానే కేంద్ర మన రాష్ట్ర నాయకులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా..? కనీసం ముఖ్యమంత్రి, పిసి చీఫ్, కేంద్ర మంత్రుల లాంటి ఉన్నత స్థాయి నాయకులకు కూడా ఈ విషయం తెలియదా మరి అప్పుడే ఆపే ప్రయత్నం ఎందుకు చేయకుండా..? ఇప్పుడు నిరసనలకు ఎందకు దిగుతున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యంగా గుర్తించాల్సిన అంశం ఒకటుంది. అదే కేంద్ర మంత్రి చిరంజీవి తీరు. జరిగిన పరిణామాలన్ని గమనించిన వారికి చిరంజీవి విభజన విషయం ముందేగానే తెలుసా అనే అనుమానం రాకమానదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ వాయిదా వేసేది లేదంటూ భీష్మించు కూర్చున్న దిల్‌రాజు సడన్‌గా ఎవడు పోస్ట్‌పోన్ డెసిషన్ వెనుక చిరు ప్రమేయం లేదంటారా..?
ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయను అని ప్రెస్‌మీట్ పెట్టి మరి నొక్కి వక్కానించిన దిల్‌రాజు 48 గంటలు గడవగానే సినిమాను ఏకంగా నెల రోజులు వాయిదా వేయటం చర్చనీయాంశం అయింది. విభజన విషయం ముందుగానే తెలిసిన చిరు కావాలనే తన కొడుకు సినిమాను వాయిదా వేయించడన్న టాక్ వినిపిస్తుంది.