Read more!

జగన్‌కి ఈ జన్మలో సిగ్గు రాదు!

వైసీపీ నాయకులు వైఎస్ జగన్‌ ఎంత పెద్ద అబద్ధం చెప్పడానికైనా ఎంతమాత్రం సిగ్గుపడరు.. అధికారంలోకి రావడానికి, ఆ తర్వాత అధికారంలో వున్నప్పుడు సిగ్గుపడకుండా ఎన్నో అబద్ధాలు చెప్పారు.  ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కొంచెమైనా సిగ్గుపడతారేమోనని ఆశించడం దురాశే అని తెలిసిపోయింది. అంతేకాదు.. ఆయనకి ఈ జన్మలో సిగ్గు అనేది రాదు అనేది క్లారిటీగా అర్థమైపోయింది. తన పార్టీ ఎమ్మెల్సీలు ఎక్కడ చేపల్లాగా జారిపోతారో అని భయపడుతూ వాళ్ళతో జగన్ ఈమధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళతో మాట్లాడుతూ, అధికారం కోల్పోయాం కాబట్టి మనకి భవిష్యత్తులో కష్టాలు వుంటాయి.. ఆ కష్టాలు ఎదుర్కొని నిలబడితే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పారు. ఇలా చెప్పడం అనేది, పార్టీలోంచి పారిపోకండి అని వాళ్ళకి జగన్ సగౌరవంగా చేసిన హెచ్చరిక. సరే, జగన్ చేసిన హెచ్చరికకి ఆయన పార్టీ ఎమ్మెల్సీలు ఎలా స్పందిస్తారో, వైసీపీలోనే వుంటారో లేక మరో పార్టీలోకి జంప్ అయిపోతారో మనకెందుకుగానీ, ఈ సమావేశం సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు వింటే మాత్రం, ఆయన ఈ జన్మలో మారడని, ఈ సిగ్గులేని బతుకు ఇలా కంటిన్యూ అవుతూనే వుంటుందని తెలిసిపోతోంది.

అధికారంలో వున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయిపోయాయట.. ఇప్పుడు మరో ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు మళ్ళీ అధికారంలోకి వస్తారట.. నిన్నగాక మొన్నే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పార్టీని తన్ని తరిమారు. జనం చేసిన గాయాలు మానడానికే చాలాకాలం పడుతుంది... కానీ, అధికార పార్టీ చాలా తప్పులు చేస్తుందని, ఐదేళ్ళ తర్వాత తన పార్టీదే అధికారమని ఆయన చెప్పుకొస్తున్నారు. ఏమిటి ఈయనకి వున్న ధైర్యం? ఏమిటి ఈయనకు చంద్రబాబు పరిపాలన మీద వున్న అపనమ్మకం? ఒకపక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూ వుండగానే, మరోపక్క ఈ సమావేశం జరిగింది. అప్పుడే ఈయన చంద్రబాబు పాలనలో ఫెయిల్ అయిపోతారని, ఈయన మళ్ళీ అధికారంలోకి వస్తారని కలలు కంటూ వుంటే, ఈయన్ని ఇంకేమనాలి? 

తన ప్రసంగంలో మొత్తం ప్రజలకు అలా డబ్బు ఇచ్చాను.. ఇలా డబ్బు ఇచ్చాను.. అయినా మనకి ఓట్లు పడలేదని చెప్పుకుని బాధపడిపోయారు. అంటే, ఓట్ల కోసమే డబ్బు పంచానని జగన్ చెబుతున్నట్టే కదా? డబ్బు పంచాను అని చెప్పడం కూడా ఏదో తన సొంత ఆస్తి పంచి ఇచ్చినట్టు బిల్డప్పుతో చెబుతున్నారు. ఐదేళ్ళ కాలంలో తన సొంత ఆలోచనలతో ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, అప్పుల మీద అప్పులు చేసి డబ్బు తెచ్చి బటన్లు నొక్కుతున్నాను అని గొప్పగొ చెప్పుకున్న ఈ మనిషికి జీవితంలో బుద్ధి వచ్చే అవకాశం లేదు. 

ఇంత జరిగినా, ప్రజలు ఇంతలా బుద్ధి చెప్పినా, జగన్‌కి మాత్రం బుద్ధి వచ్చినట్టు కనిపించడం లేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు మీద విషం కక్కడమే... జనం ఇంత దారుణగా ఓడించారంటే, నా వైపు నుంచి తప్పేమైనా వుందా అని ఒక్క క్షణం కూడా జగన్ ఆలోచించిన దాఖలాలు కనిపించడం లేదు. తాను చాలా గొప్పవాడు.. చంద్రబాబు చాలా చెడ్డవాడు.. ప్రజలకి డబ్బు బోలెడంత ఇచ్చాను.. అయినా నన్ను ఓడించారు.. అయిదేళ్ళ తర్వాత మళ్లీ గెలుస్తాను.. మీటింగంతా ఇదే వరస. పోనీలే, జగన్ ఇలా మాట్లాడ్డమే మంచిది. ప్రజలకు ఈయన స్వభావం ఇంకా పూర్తిగా అర్థమయ్యే అవకాశం వుంటుంది. దేశంలో సిగ్గూశరం లేని రాజకీయ నాయకులు చాలామంది వున్నారు.. కానీ వాళ్ళందరిలో నంబర్‌వన్‌గా నిలిచే నాయకుడు జగన్.. నో డౌట్!