Read more!

చంద్రబాబు కేబినెట్ లో మంత్రుల శాఖలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వద్ద సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలతో పాటు కేబినెట్ లో మంత్రులకు కేటాయించని శాఖలన్నీ ఉంచుకున్నారు. 

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. నారా లోకేష్ కు  మానవవనరుల అభివృద్ధి, ఐటీ ఏలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలు కేటాయించారు.
కింజరపు అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్ మెంట్, ఫిషరీస్ శాఖలను కూటాయించారు. కొల్లు రవీంద్రకు మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ శాఖలకు కేటాయించారు.

నాదెండ్ల మనోహర్ కు ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలను కేటాయించారు. పొంగూరు నారాయణకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు కేటాయించారు. వంగలపూడి అనితకు హోం శాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు కేటాయించగా,  సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలను కేటాయించారు. అలాగే నిమ్మల రామానాయుడికి జలవనరుల అభివృద్ధి శాఖను కేటాయించారు. మహ్మద్ ఫరూఖ్  కు లా అండ్ జస్టిస్, మైనారిటీ సంక్షేమ శాఖ కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు. పయ్యావుల కేశవ్ కు ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ టాక్స్,లెజిస్లేటివ్ శాఖలను కేటాయించారు. అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖను, కొలసు పార్థసారథికి హౌసింగ్, సమాచార, పౌరసరఫరాల శాఖలను కేటాయించారు. అదే విధంగా డోలా బాల వీరాంజనేయస్వామికి సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ సంక్షేమం సచివాలయ, గ్రామ వాలంటీర్ శాఖలను కేటాయించారు. 

ఇక గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖను కేటాయించారు. అదే విధంగా  కందుల దుర్గేష్ కు టూరిజం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి శాఖలను, గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశుసంక్షేమం, గిరిజనాభివృద్ధి శాఖలను, బీసీ జనార్ధన్ రెడ్డికి రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు,  పెట్టుబడుల శాఖ కేటాయించారు.

టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలను, ఎస్ సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ శాఖలను, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక, పరిశ్రమలు, బాయిలర్స్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖలను కేటాయించారు.
ఇక కొండపల్లి శ్రీనివాస్ కు ఎమ్ఎస్ఎమ్ఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖలను, మందిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి ట్రాన్స్ పోర్ట్, యువజన, క్రీడా శాఖలను కేటాయించారు.