బైరెడ్డి బాటపట్టిన టి.ఆర్.ఎస్
posted on Aug 28, 2012 @ 4:49PM
రాయలసీమను ప్రత్యేకరాష్ట్రంగా గుర్తించాలంటూ టిడిపి నేత, రాయలసీమ పరిరక్షణ సమితి ఛైర్మన్ బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రస్థాయిలో చేస్తున్న ఆందోళనవల్ల ఇన్నాళ్లూ మరుగునపడి పోయిన అసలు సమస్యలు వెలుగులోకొస్తున్నాయి. రాయల సీమకి తీరని అన్యాయం జరుగుతోందంటూ బైరెడ్డి గొంతెత్తి మాట్లాడేసరికి మిగతా వేర్పాటువాదులు సైలెంటైపోతున్నారు. ఇప్పటివరకూ తమ ప్రాంతానికి ఎంతగా అన్యాయం జరిగిందో చెప్పేందుకు బైరెడ్డి వాడుతున్న పదాలు కొందరికి సూదుల్లా గుచ్చుకుంటున్నాయ్. బైరెడ్డి పుణ్యమా అని తెలంగాణ వాదులుకూడా అనవసరమైన గొడవలు మానేసి.. కరెంటు కష్టాలు, మంచినీళ్ల కష్టాలగురించి మాట్లాడ్డ మొదలుపెట్టారు. తెలంగాణ మొత్తం మంచినీళ్ల సమస్యతో అల్లాడిపోతోందని కెటిఆర్ తెగబాధపడిపోతున్నారు. సాగర్ నీళ్లను కిందికి వదలడానికి వీల్లేదని, డ్యామ్ లోనే స్టోర్ చేయాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ విషయంలో బైరెడ్డికి కనిపిస్తున్న ఆదరణను చూసి టి.ఆర్.ఎస్ కూడా తీవ్రస్థాయిలో రెచ్చిపోతోంది. బైరెడ్డి ఆందోళన పుణ్యమా అని తెలంగాణ రగడ కాస్త నిదానించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఊపిరిపీల్చుకుంటున్నారు.