గాలి.. జైలర్నికూడా కొనేశాడా?
posted on Aug 28, 2012 @ 4:46PM
బెయిల్ కోసం కోట్లాది రూపాయలు కుమ్మరించి జడ్జీల్నే కొనేసిన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు జైలర్నికూడా కొనేశాడన్న వదంతులు గట్టిగా వినిపిస్తున్నాయి. చంచల్ గూడ సూపరిండెంట్ కేశవనాయుడు గాలికి గంటలకొద్దీ ములాఖత్ లు ఏర్పాటు చేస్తున్నాడని లోకల్ మీడియా కోడైకూస్తోంది. ఇందుకోసం గాలి కేశవనాయుడిక్కూడా కోట్లరూపాయలు సమర్పించుకున్నాడని డెక్కన్ క్రానికల్ పత్రిక వార్తని ప్రచురించింది. భారీగా డబ్బుతీసుకున్న కేశవనాయుడు జైల్లో గాలికి భారీ సౌకర్యాలు కల్పించాడన్న వార్తలు గుప్పుమనడంతో ప్రభుత్వం ఆయన్ని మరో పదవికి మార్చేసింది. చంచల్ గూడ జైలుకి కొత్త సూపరింటెండెంట్ గా సైదయ్యను నియమించారు. అప్పట్లో జగన్ కి రాచమర్యాదలు చేసేందుకు యమా ఉత్సాహం చూపించిన జైలు అధికారి వెంకటేశ్వర్ రెడ్డిమీదకూడా వేటుపడింది. రెండువారాల క్రితం చంచల్ గూడ డెప్యూటీ సూపరింటెండెంట్ల బదిలీలుకూడా రాత్రికిరాత్రే చకచకా జరిగిపోయాయ్. జైల్లో ఉంటున్న వీఐపీ ఖైదీల ములాఖత్ ల గోల భరించలేక తమను ట్రాన్స్ ఫర్ చేయమని అధికారులు తెగ మొరపెట్టుకున్నారన్న విషయంకూడా వార్తల్లోకెక్కింది. వీటిలో నిజమెంతో.. అబద్ధమెంతో గాలివాటానికి పవరెంతో నిలకడమీదగానీ తేలాలి.