విద్యుత్త్ ఉద్యోగుల చర్చలు విఫలం
posted on Oct 8, 2013 @ 6:48PM
మంత్రివర్గ ఉపసంఘంతో విద్యుత్త్ ఉద్యోగుల చర్చలు విఫలమైనాయి. ఈరోజు సాయంత్రం మరోసారి చర్చలకు భేటీ కానున్నట్లు విద్యుత్త్ ఉద్యోగుల జె.ఏ.సి తెలియజేసింది. రాష్ట్ర విభజన మూలంగా తలెత్తే విద్యుత్త్ సమస్యలను మంత్రి వర్గ ఉపసంఘానికి వెల్లడించామని,సమైఖ్య రాష్ట్రం పై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వస్తేనే సమ్మె విరమిస్తామని విద్యుత్త్ ఉద్యోగస్తులు తెలియ చేయటం జరిగింది. ఇదిలా ఉండగా సీమాంద్ర లోని చాలా రంగాలు ఈ విద్యుత్త్ సమ్మె కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఒక పక్క హాస్పిటల్స్ లో విద్యుత్త్ లేని కారణం గా రోగులు చాలా అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల జేనరేటర్లు కూడా పనిచేయని కారణంగా జరుగవలసిన ఆపరేషన్లు కూడా వాయిదా పడినాయి. సీమాంధ్ర లోని చాలా ప్రాంతాలలో రైళ్ళను రద్దు చేయగా,చాలా ప్రాంతాలలో నీళ్ళు లేక,పాలు లేక ఎ.టి.ఎమ్ లు పనిచేయక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు.