మాజీ డి.జి.పి భూకబ్జా దారుడా?
posted on Oct 8, 2013 @ 6:51PM
సి.ఎం పై డి.జి.పి చేసిన వ్యాఖ్యానాలు సరియైనవి కావని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. డి.జి.పి గా ఆ పోస్ట్ ఎలా వచ్చిందో ఆయనకు గుర్తుందా అని ఆయన అడిగారు. దినేష్ రెడ్డి ముందు తన మీద ఉన్న ఆరోపణల నుండి ఆయన బయటపడాలని సూచించారు. ముఖ్య మంత్రి తమ్ముడి మీద భూకబ్జ ఆరోపణలు చేసే ముందు దినేష్ తన మీదున్న అనేక భూఆక్రమణల వివాదాలకు వివరణ ఇవ్వాలని మంత్రి అన్నారు. డి.జి.పి పదవి కొనసాగింపు అంశం చట్ట పరిధి లోనిది అని మంత్రి వ్యాఖ్యానించారు. సి.ఎం ను విమర్శించే స్థాయి దినేష్ రెడ్డికి లేదని ఆనం అన్నారు. డి.జి.పి గా కొనసాగేందుకు క్యాట్ నిరాకరించిందని,ఆయన పైన ఉన్న అవినీతి ఆరోపణల రీత్యా సుప్రీం కోర్ట్ ఆయన పదవి కొనసాగింపు కుదరదని తీర్పునిస్తే దానికి ముఖ్య మంత్రి ఏమి చేస్తారని మంత్రి ఆనం ప్రశ్నిస్తున్నారు.