పాఠశాలలు మూసేయాల్సిందేనా?
posted on Aug 25, 2022 @ 12:49PM
టీచర్ కొడుతున్నాడని బడి మానేయడం, ట్యూషన్లే మేలని టీచర్ మానేయడం.. ఈ కారణా లతోనే దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికే చాలా పాఠశా లలు మూసివేత స్థితికి వచ్చా యని విద్యారంగ నిపుణులు విమ ర్శిస్తున్నారు. అసలీ పరిస్తితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని పాఠశాలలను అభివృద్ధి చేసే వ్యూహాలు పకడ్బందీగా అమలు చేయడం అన్నది పోయిందనేదీ అనేకమంది విమర్శకుల మాట. ఇది ఎంతో నిజమని పిల్లల తల్లిదండ్రులూ అంటున్నారు.
అస్సాంలో ఇటీ వలి పదో తరగతి పరీక్షల్లో ఏకంగా 34 పాఠశాలల్లో ఏ ఒక్క విద్యార్ధీ ప్యాస్ కాలేదు. ఇది ఇక్కడి విద్యాబోధన, పాఠశాలల పరిస్థి తులకు అద్దం పడుతుంది. ఇలాంటి స్థితి ఎన్నాళ్లుగానో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం ఇపుడు వాటి మూసివేతకు ప్రభుత్వాలే ఆదేశాలు జారీ చేయడం విచారకరం.
తరగతి గదులు సరిగా లేకపోవడం, విద్యాబోధనకు సరయిన వాతావరణం లేకపోవడం, విద్యార్ధులను బడికి తీసుకువచ్చేట్టు చేయడంలో అధికారులు, తల్లిదండ్రులు విఫలం కావడం వంటి అనేకం ఇప్పటి పలితాలకు కారణాలు కావచ్చు. ఉపాధ్యాయులు బడికి దూరంగా ఉండడం, రాకపోకలు, సాదకబాధకాల్లో విద్యార్ధులు నష్టపోతున్నారనే అనాలి. దీనికి సరయిన పరిష్కారాలు ఆలోచించి అమలు చేయాలి. అంతేగాని పాఠశాలలు మూసివేయడం సరయిన నిర్ణయం కాదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అభిప్రాయపడ్డారు. పాఠశాలలను మెరుగుపర్చడం ఒక్కటే మళ్లీ విద్యార్ధులకు చదువు పట్ల, ఫలితాలపట్ల దృష్టి మళ్లించగలదని ఆయన అన్నారు. పాఠశాలలు మూసివేయడం విద్యార్ధులను, పిల్లలను బడికి మరింత దూరం చేస్తుందన్నది ప్రభుత్వాలు గ్రహించాలన్నారు కేజ్రీవాల్.
విద్యార్ధుల సంఖ్యను, ఉపాధ్యాయుల సంఖ్యను పెంచడానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. వారికి మెరుగైన అవకాశాలు, పరిస్థి తులు కల్పించాలన్నది విద్యాధికుల మాట. ఏ ప్రాంతంలోనయినా విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు మధ్య విభేదాలు, దూర భారాలు పెరగకుండా ఉండాలి. చదువు పట్ల ఆసక్తి విద్యార్ధుల్లో మరింత పెంచేలా బోధనా విధానం ఉండాలన్నది విద్యా వేత్తలు అనాదిగా చెబుతున్నది.