సభకు సర్వం సిద్దం
posted on Sep 7, 2013 8:51AM
తెలంగాణ ఉద్యమకారుల ఆంక్షలు బెదిరింపుల మధ్య ఏపిఎన్జీవోల సభకు సర్వం సిద్దమయింది. తెలంగాణ రాజకీయ జేఎసితో పాటు పలు సంఘాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్ని చేదించుకుంటూ వేలాదిగా సీమాంద్ర ఉద్యోగులు హైదరాబాద్ చేరుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో సభను సక్సెస్ చేస్తామంటున్నారు ఎన్జీవోలు.
పోలీసులు కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నగరంలోకి వచ్చిన దాదాపు 70 బస్సులను పోలీస్ సెక్యూరిటీతో సిటీలోకి తీసుకువచ్చారు. దీంతో పాటు వివిద జిల్లాలనుంచి ట్రైన్‌లు ఇతర రవాణా మార్గాల ద్వారా వస్తున్న వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సొంత వాహనాలలో వచ్చిన ఉద్యోగస్తుల కోసం పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఆలియా కళాశాల ప్రాంగణాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.