నిజాం కాలేజీ హాస్టళ్ వద్ద ఉద్రిక్తత
posted on Sep 7, 2013 @ 10:45AM
నిజాం కాలేజీ హాస్టళ్ల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిజాం కాలేజీ హాస్టళ్లలో ఉన్న నాన్ బోర్డర్లను బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో హాస్టళ్లల్లో వున్న విద్యార్ధులు ఆందోళనకు దీగారు. దీంతో పోలీసులు విద్యార్ధుల మధ్య తోపులాట జారింది. పోలీసుల తీరుకి నిరసనగా విద్యార్ధులు రోడ్డుపై బైటాయించారు. కొందరు విద్యార్ధులు పోలీసులపై రాళ్ళు రువ్వారు. విద్యార్ధి విభాగం నేత సుమన్ తో సహా పదిమందిని అరెస్టు చేశారు. మరోవైపు ఎల్.బి.స్టేడియం వద్దకు ఎన్.జి.లో పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సీమాంధ్రలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది తమ గుర్తింపు కార్డులు చూపి సభ ప్రాంగణంలోకి వెళుతున్నారు.సభ జరగడానికి దాదాపు ఆరు గంటల ముందు నుంచే ఇంతగా జనం హాజరవడం అరుదుగా జరుగుతుంటుంది.