బాబా ఆరోగ్యంపై పిటిషన్
posted on Apr 15, 2011 @ 12:41PM
అనంతపురం: సత్యసాయి బాబా ఆరోగ్యంపై పెనుగొండ కోర్టులో న్యాయవాది భాస్కర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బాబా ఆరోగ్యస్థితి, ట్రస్టు వివరాలు వేల్లదిన్చాలంటూ న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు. బాబా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించినవారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. బాబాను భక్తులకు చూపించాలంటూ ఆయన ప్రైవేట్ కేసును వేశారు.
కాగా, సత్యసాయి బాబా ఆరోగ్యంపై నిజానిజాలు వెల్లడించాలని మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు అయ్యింది. చికిత్స పేరుతో బాబాను ఆస్పత్రిలో ఉంచి ఆయన వివరాలు దాచి పెడుతున్నారంటూ దళిత జనసభ అధ్యక్షుడు గద్ద శ్రీనివాస్ హెచ్‌ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సత్యసాయి ట్రస్ట్, ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటిషన్‌లో డిమాండ్ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న బాబా దొంగ భక్తులపై చర్య తీసుకోవాలని కోరారు. ట్రస్ట్ సభ్యులు, ఆస్పత్రి యాజమాన్యం కుమ్మక్కై బాబా ఆరోగ్య వివరాలు రహస్యంగా ఉంచుతున్నారన్నారు. బాబా ఆరోగ్యంగా ఉంటే భక్తులందరికీ దర్శనమిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని దళిత జనసభ తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే మీడియాను కూడా ఆస్పత్రిలోకి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.