ట్రస్టు సభ్యుల చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
posted on Jun 25, 2011 @ 3:49PM
హైదరాబాద్: సత్య సాయి ట్రస్టు సంపద తరలింపు కేసులో సభ్యులపై పోలీసులు ఉచ్చు బిగిస్తోంది. పోలీసులు ట్రస్టు సభ్యులను, సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు. తనకు జారీ అయిన సమన్లపై సమాధానం ఇచ్చేందుకు తనకు మరింత సమయం కావాలని ఆయన అనంతపురం జిల్లా పోలీసులను ట్రస్టు సభ్యుడు వి. శ్రీనివాసన్ కోరారు. ఈ నెల 27వ తేదీన ఆయన జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం ముందు హాజరు కావాల్సి ఉంది. శ్రీనివాసన్‌కు 72 గంటల గడువు ఇచ్చారు. వ్యక్తిగతమైన పనులు ఉన్నందున ఆ రోజు తాను హాజరు కాలేనని శ్రీనివాసన్ చెప్పారు. పెనుగొండ దర్యాప్తు బృందం ఈరోజు ఉదయం శ్రీనివాసన్ వ్యక్తిగత సహాయకుడు వెంకటేష్‌ను ప్రశ్నించింది. అనంతరం రత్నాకర్ ను విచారించారు. ప్రశాంతినిలయంలోని ఆయన నివాసంలో ఆయనను విచారించారు. సంపద తరలింపులో అరెస్టయిన సోహన్ శెట్టికి సన్నిహితుడైన సదాశివ ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. స్థానిక సిఐ మధుసూదన్ ప్రశాంతి నిలయంలో ట్రస్టు కార్యదర్శి కె. చక్రవర్తిని కలిశారు. యజర్వేద మందిరం తెరిచినప్పటి నుంచి వాహనాల రాకపోకలపై ఆయన ఆరా తీశారు.