సంజూకి చేజారిన వరల్డ్‌కప్ అవకాశం
posted on Oct 11, 2022 @ 3:35PM
ఎంత బాగా ఆడినా, ఎంతగా ప్రశంసలు పొందినా కొందరికి దురదృష్టం వెన్నాడుతూనే ఉంటుంది. చాలా కాలం నుంచి భారత్ జట్టులో కీలకపాత్రవహించి జట్టు విజయాల్లో పాలుపంచుకోవాలనుకున్న స్టార్ బ్యాట్స్ మన్‌లు ప్రపంచకప్ జట్టుకి ఎంపిక కాకుండా జట్టుకు దూరం కావడం జరుగుతూనే ఉంది. అం దుకు పెద్ద ఉదాహరన వివిఎస్ లక్ష్మణ్. ఇపుడు సంజూ శాంసన్. సంజూ 2022 ప్రపంచకప్ కి చివరి నిమి షంలో అవకాశం కోల్పోయాడు.
సంజూ ఇటీవల ఎంతో అద్భుతంగా రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో తలపడుతు న్న వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో 63 బంతుల్లో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నిం గ్స్ సెలక్టర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రేక్షకులు, తోటి ప్లేయర్లు అతన్ని వరల్డ్ కప్ జట్టులో ఉండా లని కోరు కున్నారు. కానీ అతనికి దినేష్ కార్తిక్, రిషబ్ పంత్ గట్టిపోటీనే ఇచ్చారు. రాంచీలో జరిగిన రెండో మ్యాచ్ లో కూడా 36 బంతుల్లో 30 పరుగులు చేయడంలో జట్టు కీలకదశలో ఇన్నింగ్స్‌ను నిలబెట్ట డంలో నమ్మదగ్గ బ్యాటర్‌గా ఆకట్టుకున్నాడు. శ్రేయస్ అద్బుత సెంచరీ చేయడంతో సిరీస్ బెస్ట్ ప్లేయర్‌గా నిలిచినప్పటికీ, సంజూ శాంసన్ ఎంతో మంచి ప్లేయర్‌గా అందరి మన్ననలు అందు కున్నాడు.
దక్షిణాఫ్రికా, భారత్ వన్డే సిరీస్‌లో సంజూ తన స్థాయిని ప్రదర్శించడానికి, సెలక్టర్లను ఆకట్టుకోవడానికి కాయ కష్టం చేశాడు. కానీ అదృష్టం వరించలేదు. అతని స్థానంలో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్‌లకు అవ కాశం ఇచ్చారు. అయితే, బ్యాటింగ్ లైన్లో 5వ స్థానంలో చెప్పుకోదగ్గ బ్యాటర్‌గా సెలక్టర్లు గుర్తిం చారు. అయితే, దినేష్ కార్తీక్ కూడా లేట్‌గా గొప్ప గుర్తింపు పొందిన ప్లేయర్‌గానే గుర్తింపు పొంది జాతీయ జట్టు లోకి రావడం గమనార్హం.