శానిటైజర్ తాగి 8 మంది మృతి.. ఈ పాపం ఎవరిది?
posted on Mar 23, 2021 @ 10:30AM
ఎవరైనా దాహం వేస్తే నీళ్లు తాగుతారు, లేదంటే కూల్ డ్రింక్ తాగుతారు. వేడి చేస్తే మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతారు. వీకెండ్ అయితే లైట్ గా మందు తాగుతారు. వీళ్ళు మాత్రం మద్యం ధరలు పెరిగాయని శానిటైజర్ తాగారు. కొన్నీ శానిటైజర్ బాటిల్స్ కూడా సేమ్ లిక్కర్ బాటిల్ లాగే ఉంటాయి. మరి మధ్య మత్తులో ప్యాకెట్ లో ఉన్న శానిటైజర్ బాటిల్ ని మందు అనుకుని తాగారో ఏమో గానీ మొత్తానికి వాళ్ళు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు .
విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన బెజవాడ మధు, సత్యనారాయణ అనే వ్యక్తులు శానిటైజర్ తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరి మరణం స్థానికుల్లో కలకలం రేపుతోంది. శానిటైజర్ తాగడం వల్లే వారు చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతుండగా వైద్యులు మాత్రం ధృవీకరించడం లేదు. మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో రిక్షా కార్మికులు, కూలీలు శానిటైజర్‌ను కూల్ డ్రింక్‌లో కలుపుకుని సేవించారు. మృతి చెందారు అని కొందరు అంటున్నారు. కాగా అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసులు నమోదు చేశారు.