రావణాకాష్టానికి కేంద్రమే కారణమా?
posted on Aug 25, 2012 9:26AM
తెలంగాణ వాదం మరోసారి తెరపైకి వచ్చింది. విభజనవాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రాంతీయ పార్టీలు ప్రాంతాల మద్య చిచ్చుపెట్టి, విద్వేషాలను రగుల్చుతుండగా కేంద్రం గుడ్లప్పగించి చూస్తుందని సమైఖ్యతావాదులు మండిపడుతున్నారు. ఢిల్లీ వరకు వెళ్లి తమ సమైఖ్యతా వాదాన్ని వినిపిస్తామని, తెలుగు జాతిని విడగొట్టాలనుకునే ఏ పార్టీనైనా సీమాంద్రలో బహిష్కరిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. దీనికి గానూ సీమాంద్రకు చెందిన 13 జిల్లాలు, 14 యూనివర్సిటీలకు సంబందించిన విద్యార్ధి జెఏసి నేతలు బేటీ అయ్యారు.
రాష్ట్రంలో నెలకొన్న అస్ధవ్యస్త పరిస్థితులకు కేంద్రప్రభుత్వమే కారణమని చెబుతున్నారు.నిష్టాతులైన శ్రీకృష్టా కమిటి ఏడాది పాటు రాష్ట్రంలో పర్యటించి సమగ్ర విచారణ జరిపి అందచేసిన నివేదికను కేంద్రం చెత్త బుట్టలో పడేసిందని ద్వజమెత్తుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ప్రాంతీయ పార్టీలను విలీసం చేసుకునే ఎత్తుగడలో కేంద్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని సమైఖ్యాంద్ర జెఎసి నేతలు ద్వజమెత్తుతున్నారు. వేర్పాటు వాదాలను, ఉద్యమాలను అరికట్టిదేశ సమగ్రతను కాపాడాల్సిన కేంద్రమే రాష్ట్రంలో రావణకాష్టాన్ని పెంచి పోషిస్తుందని మండి పడుతున్నారు. సీమాంద్ర ప్రజాప్రతినిధులు కూడా సమైఖ్యరాష్ట్రాన్ని కాకుండా అధిష్టానం మాటవిని వేర్పాటు వాదాన్ని సమర్ధిస్తే సీమాంద్రనుండి వారిని బహిష్కరిస్తామని హెచ్చరించారు.