సీనియర్ మంత్రుల్లో అంతర్మధనం
posted on Aug 25, 2012 9:18AM
మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు రాజీనామాను గురించి మాట్లాడటానికెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యన్నారాయణ బుక్ అయ్యినట్లు తెలుస్తుంది. ధర్మాన రాజీనామాను అంగీకరించడమే కరెక్టు అని చెప్పిన అధిష్టానం పనిలో పనిగా వీరిరువురి పైనా వేటుకు సిద్దంగా ఉండటంతో బిక్కచచ్చిన మొహాల్తో వీరిద్దరూ ఉన్నారనే విషయం తెలిసింది. ధర్మాన రాజీనామాగురించి మాట్లాడుతూ ఇప్పుడు మంత్రులకు సంబంధం లేదంటే జగన్ తప్పించుకో వచ్చు గనుక వారిని కూడా సిబిఐ విచారణకు సిద్దపడాల్సిందే నని అధిష్టానం తేల్చింది. మంత్రులను తప్పించడం వల్ల ప్రజలమద్యకు తప్పుడు సంకేతాన్ని అందించినట్లవుతుందని అందువల్ల రాజీనామాను ఆమోదించటం సరైన మార్గంగా కేంద్రం భావిస్తుంది.
దీంతో రాష్ట్రంలోని మిగతా సీనియర్ మంత్రులు హతాషు లయ్యారు. వారంతా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరుగా జైలు జీవితం రుచి చూడవలసి వుంది. ఇప్పటికే ఈ కేసులో మంత్రి మోపిదేవి చంచల్‌గూడా జైలులో ఉన్నారు. మంత్రుల మీద చార్జిషీటు పెట్టినప్పుడే క్యాబినెట్‌కు సంబంధంలేదని చెపితే బావుండేదని, అయితే జగన్ కు క్విడ్‌ప్రోకో కేసుగా మాత్రమే ఉంటుందని చెప్పటం వల్ల తమంతా నమ్మినందుకు కేంద్రం తమకు నమ్మక ధ్రోహం చేసిందని మంత్రులంతా మధన పడుతునన్నారు. అయితే ఇది ఇంతటితో ఆగకుండా పిసిసి చీఫ్ బొత్సకు, ముఖ్యమంత్రికి కూడ చుట్టుకుంది. ఇప్పటికి అందిన వివరాల ప్రకారం సోనియా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ గంటసేపు మంతనాలు జరిపారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్, వాయిలార్‌రవి, అహ్మద్‌పటేల్ కూడా పాల్గొన్నారు. చర్చల అనంతరం ముఖ్యమంత్రి విచారవదనంతో డిల్లీలో తిరుగుతున్నారు. గురువారం నాటికే పిసిసి నుండి బొత్సకు రాంరాం అని తెలిసి పోయింది. ఈ ప్రక్షాళన ఎంతటితో ఆగుతుందో తెలియని మంత్రులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఏది ఏమైనా హస్తిన రాజకీయాలతో రాష్ట్రంలోని హస్తానికి పునాదులు పడిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.