విరాట్, సచిన్.. ఎవరెంత కొట్టారు..?
posted on Feb 4, 2016 @ 3:21PM
భారత్ క్రికెట్ లెజెండ్.. అభిమానులు క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ గురించి.. ఆయన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. మరి అలాంటి సచిన టెండూల్కర్ లా ఆడగల సత్తా ఎవరికి ఉందంటే.. ఇప్పుడు ఉన్న టీం ఇండియాలో వెంటనే గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లి. ఆడే విధానంలో విరాట్ కు, సచిన్ కు మద్య చాలా పోలికలు ఉన్నాయి. అయితే ప్రసుత్తం వేగంగా పరుగులు సాధిస్తూ దూసుకుపోతున్న కోహ్లి ఇప్పటివరకూ 171 వన్డేలు.. 41 టెస్ట్ లు ఆడాడు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లి పరుగులతో.. సచిన పరుగులతో పోల్చి చూస్తే దాదాపు ఇద్దరూ ఒకేలా ఆడినట్టు కనపడుతోంది. ఇంతకీ ఎవరెవరూ ఎన్ని పరుగులు తీశారో ఓ లుక్కేద్దాం..
విరాట్ కొహ్లి..
* 171 వన్డేలు -- 163 ఇన్నింగ్స్ ఆడి 51.51 సగటుతో 7212 పరుగులు చేశాడు.
సెంచరీలు - 25
హాఫ్ సెంచరీలు - 36
అత్యధిక వ్యక్తిగత స్కోరు 183.
నాటౌట్ గా 23సార్లు
* 41 టెస్టుల్లో -- 72 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 44.02 సగటుతో 2994 పరుగులు చేశాడు.
సెంచరీలు - 11
హాఫ్ సెంచరీలు - 12
అత్యధిక వ్యక్తిగత స్కోరు 169
నాటౌట్ - 4
సచిన టెండూల్కర్
* సచిన్ 171 వన్డేల్లో -- 166 ఇన్నింగ్స్ ఆడి 38.85 సగటుతో 5828 పరుగులు సాధించాడు.
సెంచరీలు -- 12
హాఫ్ సెంచరీలు -- 36
అత్యధిక వ్యక్తిగత స్కోరు 137.
నాటౌట్ గా -- 16సార్లు
* సచిన్ 41 టెస్టులు -- 60 ఇన్నింగ్స్ ఆడి 54.92 సగటుతో 2911 పరుగులు సాధించాడు.
సెంచరీలు -- 10
హాఫ్ సెంచరీలు -- 14
అత్యధిక వ్యక్తిగత స్కోరు 179
నాటౌట్ గా -- 7సార్లు