సచిన్‌కు భారత రత్న!
posted on Apr 6, 2011 @ 10:01AM
మహారాష్ట్ర: ప్రపంచకప్‌ను గెలుపొందిన భారత క్రికెట్ జట్టును మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం అభినందించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు దేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' ఇచ్చి సత్కరించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. అభినందన తెలుపుతూ, టెండూల్కర్‌కు భారత రత్న ప్రతిపాదన తీర్మానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రవేశపెట్టగా అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. 'క్రీడల్లో అత్యున్నత సేవలకుగాను టెండూల్కర్‌కు ఈ అవార్డును ప్రతిపాదిస్తున్నాను' అని చవాన్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ప్రకటించారు. 28 సంవత్సరాల తర్వాత 121 కోట్ల మంది భారతీయుల కల సాకారమైందన్నారు. ప్రపంచకప్‌లో ఆడిన మహారాష్ట్ర క్రీడాకారులు టెండూల్కర్, జహీర్ ఖాన్‌కు ఒక్కొక్కరికీ కోటి రూపాయల నగదు బహుమతితో సత్కరించనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఇదేవిధంగా టీమ్ సిబ్బంది మయాంక్ పరేక్ (లాజిస్టిక్ మేనేజర్), రమేష్ మానే (మెజరర్)కు రూ.50 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రపంకప్ ఫైనల్ మ్యాచ్ ముంబయిలో స్వేచ్ఛగా నిర్వహించేందుకు తోడ్పడిన పోలీసులు, ట్రాఫిక్ శాఖను కూడా ఆయన అభినందించారు. సభాపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే మాట్లాడుతూ సచిన్ క్రికెట్‌కు 'దేవుడు' అంటూ అభివర్ణించారు.