బాబా ఆరోగ్యంపై అనుమానాలు
posted on Apr 6, 2011 @ 10:23AM
అనంతపురం: పుట్టపర్తి సత్యసాయి బాబా ఆరోగ్యంపై అస్పష్టత తొలగిపోలేదు. ప్రశాంతి నిలయం ట్రస్ట్ నిర్వాహకులు చేష్టలపై భక్తులు తీవ్ర ఆందోళన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో బాబా ఆరోగ్యం బాగానే ఉన్నట్టు బుధవారం తాజాగా మరో వైద్య బులిటెన్‌ను డాక్టర్ సఫాయా విడుదల చేశారు. కిడ్నీలు కూడా పని చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలావుండగా, సత్యసాయి ఆస్పత్రిలో చేరి ఇప్పటికీ పది రోజులు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా ఆరోగ్యం బాగానే ఉందంటూ ఆస్పత్రి వైద్యులు చెపుతున్నారే గానీ ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారాన్ని వెల్లడించారు. ఇదిలావుండగా, బుధవారం ప్రశాంతి నిలయం వద్ద చర్యలు చూస్తుంటే భక్తులకు లేనిపోని సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు లారీల్లో పూలు తెప్పించారు. ప్రశాంతి నిలయం వద్ద ఎనిమిది వేల మంది పోలీసులను మొహరించారు. క్విక్ యాక్షన్ ఫోర్సులను రంగంలోకి దించారు. షామియానాలు వేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. ఏదో జరగరానిది జరిగిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.