మిల్లర్ సెంచరీ వృధా...సిరీస్ గెలిచిన భారత్
posted on Oct 2, 2022 @ 12:14AM
గౌహతీ క్రికెట్ అభిమానులకు ఆదివారం పండగే పండగ. ఇక్కడ జరిగిన భారత్, దక్షిణాఫ్రికా ల మధ్య జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో సూర్య, కె.ఎల్.రాహుల్, శర్మ, డేవిడ్ మిల్లర్, డీకాక్ బౌలర్లు బంతి వేయడం మర్చిపోయేలా బాదేరు అనాలి. అంతా ఫోర్లు, సీక్స్‌ల వర్షమే. భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగు లు చేసింది. భారత్ 16 పరుగులతో విజేతగా నిలవడమే గాక సిరీస్ కూడా కైవసం చేసుకుంది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో తన టీ20 కెరీర్‌లో 4000 పరుగులు చేసిన సూపర్ స్టార్‌గ నిలిచాడు.
టాస్ గెలిచినా భారత్‌కు ముందుగా బ్యాట్ చేయడానికి అవకాశం ఇచ్చింది దక్షిణాఫ్రికా. భారత్ మొదటి 5 ఓవర్లలో 49 పరుగులు చేసింది. ఆట ఆరంభం నుంచే శర్మ, రాహుల్ ఇద్దరూ దూకుడుగా ఆడారు. 6 ఓవర్లకు భారత్ 50 పరుగులు చేయగా, పది ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. శర్మ 37 బంతుల్లో 43 పరుగుల చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లీ రాహుల్ తో కలిసి విజృంభించాడు. దీంతో భారత్ 11ఓవరలో వందపరుగులు పూర్తి చేసుకుంది. రాహుల్ 50 పరుగులు 28 బంతుల్లో పూర్తిచేసాడు. రాహుల్ స్థానంలో సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్య రాగానే దక్షిణాఫ్రికా ఫీల్డర్లు ఎంతో జాగ్రత్తపడ్డారు. వస్తూనే దూకుడు ఆరంభిం చాడు. ఒకవేపు సూర్య, మరోవంక కోహ్లీ ఇద్దరు దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేరు. 15 ఓవర్లకు భారత్ 2 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అప్పటికే వారిద్దరూ కలిసి 28 బంతుల్లో 71 పరుగులు చేశారు. సూర్య వేగం పెంచి సిక్స్‌లు ఫోర్లు బాది కేవలం 18 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. 17వ ఓవర్లో పార్నల్ ఓవర్లో సిక్స్ కొట్టి కోహ్లీ తన టీ20 కెరీర్‌లో 11వేల పరుగులు పూర్తిచేశాడు. 18వ ఓవర్ వేసిన ఎన్గిడి 15 పరుగులు ఇవ్వడంతో భారత్ స్కోర్ 200 దాటింది అప్పటికి సూర్య, కోహ్లీల పాట్నర్‌షిప్ వంద పరుగులు దాటింది. 19వ ఓవర్లో మొదటి బంతికి సూర్య వెనుదిరిగాడు. అతను 22 బంతుల్లో 61 పరుగులు చేశాడు. కోహ్లీ, సూర్య 3 వ వికెట్‌కి 43 బంతుల్లో 102 పరుగులు చేశారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ చివరి ఓవర్ బాదడంలో కోహ్ల అర్ధసెంచరీ పూర్తిచేయలేకపోయాడు.
238 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కూడా అంతే అద్భుతం. ఎప్పటిలాగా మొదట కాస్తంత చప్ప గానే సాగింది. స్టార్ పేసర్ అర్షదీప్ వేసిన రెండో ఓవర్లోనే రెండు వికెట్లు సాధించాడు. ఇలా ఉండగా మూడో ఓవర్ ఆరంభంలో మైదానంలో హఠాత్తుగా పాము కనపడటంతో కొంతసేపు ఆటనిలిచింది. దక్షిణాఫ్రికా 5 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 29 పరుగుల చేఇంది. 6వ ఓవర్లో అర్ష్ 16 పరుఉల ఇచ్చాడు. 7వ ఓవర్లో మకరమ్ పెవిలియన్ దారి పట్టడంతో డాషింగ్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ వచ్చాడు. అచ్చం కోహ్లీ, సూర్యల్లానే మిల్లర్, డీకాక్ బౌలర్లను చెండాడారు. మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ప్రదర్శించాడు. బౌలర్లను అందర్నీ ఇద్దరూ బాదుడే బాదుడు అనాలి. ఒక సమయంలో వీరిద్దరూ మ్యాచ్ ముగించేస్తారన్న అనుమానం రాకపోలేదు. అంత వేగంగా జట్టు స్కోర్‌ను ఎంచారు. 15 ఓవర్లకు 143 పరుగులు చేసింది. అప్పటికే ఇద్దరూ కలిసి వందపరుగులుచేశారు. డీకాక్ అర్ధసెంచరీ 39 బంతుల్లో పూర్తిచేశాడు. మరో వంక మిల్లర్ మరింత వేగం పెంచడంతో జట్టు 18వ ఓవర్‌కే 175 పరుగులు పూర్తయ్యాయి. అప్పటికి ఇద్దరు కలిసి 129 పరుగులు చేశారు. ముందు బాగా బౌల్ చేసిన యువ పేసర్‌ని ఇద్దరు చండాడారు. దాంతో అర్ష్‌దీప్ తన 4 ఓవర్లలో ఏకంగా 62 పరుగులిచ్చాడు. 19 ఓవర్లో అతను ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. అప్పటికి జట్టుస్కోర్ 200 దాటింది. మిల్లర్ 20 ఓవర్లో రెచ్చిపోయి ఆడాడు. అతని ధాటికి స్పిన్నర్ అక్షర్ ఏకంగా 20 పరుగులు ఇచ్చాడు. మిల్లరు కేవలం 46 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడంలో భారత్ ఫీల్డర్లకు, బౌలర్లకు చుక్కలు చూపించాడు. కానీ అతని అద్భుత బ్యాటింగ్ సత్తా వృధా అయింది. చివరగా మిల్లర్ 106, డీకాక్ 69 పరుగులతో అజేయంగా నిలిచారు. ఇద్దరూ కలిసి 4వ ఇకెట్‌కి 90 బంతుల్లో 174 పరుగులు చేశారు!
దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 221 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్ సామర్ధ్యాన్ని ప్రదర్శించిన సూర్యకుమార్ యాదవ్, మిల్లర్లకు మ్యాన్ ఆఫ్ ద మయాచ్ అవార్డు ఇచ్చారు.