గోవా ఆర్ఎస్ఎస్‌లో మంటలు..
posted on Sep 1, 2016 @ 10:30AM
గోవా ఆర్ఎస్ఎస్ చీఫ్ సుభాష్ వెలింకర్‌ను పదవి నుంచి తొలిగించడం పెనుప్రకంపనలు సృష్టిస్తోంది. వెలింకర్‌ను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు, వాలంటీర్లు ఆర్ఎస్ఎస్‌లో తిరుగుబాటు లేవదిశారు. ఇప్పటికే 400 మందికి పైగా కార్యకర్తలు, వాలంటీర్లు ఆర్ఎస్ఎస్‌కు రాజీనామా చేశారు. వెలింకర్‌కు తిరిగి బాధ్యతలు అప్పగించేంత వరకు రాజీనామాలు ఉపసంహరించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం పనాజీలో ఆరుగంటల పాటు సమావేశం ఏర్పాటు చేసి, నిరసన వ్యక్తం చేశారు. సుభాష్ వెలింకర్‌ను పదవి నుంచి తొలగించేందుకు సీనియర్ ఆర్ఎస్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు, ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కుట్ర పన్నారని ఆరోపించారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గోవా పర్యటనకు వచ్చిన సమయంలో...రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గడం కష్టమని వెలింకర్ బహిరంగంగానే ప్రకటించడంతో ఆయనపై బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనపై ఆర్ఎస్ఎస్ వేటు వేసింది.