రూటు మార్చిన మంద కృష్ణ మాదిగ
posted on Aug 4, 2012 @ 10:12AM
మాదిగల హక్కులకోసం పోరాడే మందా కృష్ట మాదిగ రూటు మార్చారు ఆయన ఇక వికలాంగుల కోసం పోరాటం చేయనున్నారు. ఎన్నికలప్పుడు ఓట్లకోసం రాజకీయ పార్టీల నేతలకు వికలాంగులకు గుర్తుకు వస్తారుకాని అధికారం హస్తగతం చేసుకున్న తరువాత ఏ ప్రజాప్రతినిధికీ వికలాంగులు గుర్తుకురారని వికలాంగుల హక్కుల పోరాటం సంఘం వ్యవస్ధాపకులు మందకృష్ట మాదిగ అన్నారు. ప్రతి వర్గానికి, కులానికి సంబందించిన సమస్యలను మాట్లాడటానికి ఆయా వర్గాల నాయకులున్నారని అయితే వికలాంగులకు మాత్రం ఒక్క ప్రతినిధి కూడా లేరన్నారు. అంగవైకల్యంతో పుట్టిన వారికి పేదరికం కూడా తోడవ్వటంతో జీవన పరిస్థితులు అగమ్య గోచరంగా వుంటాయని ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి పదవిలో ఉండగా పేద పిల్లల గుండెజబ్బులకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు జరిపించాలని కోరితే 70 వేల మందికి 2004 సంవత్సరంలో ఆరోగ్య శ్రీ పధకం క్రింద ఆపరేషన్లు చేసారని తెలిపారు.
అన్ని రేట్లూ పెరుగుతుండటం వల్ల వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న 500 రూపాయల పెన్షన్‌ను పదిహేను వందలకు పెంచాలని డిమాండ్ చేశారు. వికలాంగుల పెన్షన్‌ను పెంచాటానికి వైయస్సార్ అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా ఏ ఒక్కరూ స్పందించటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులకు పంచాయితీ నుండి పార్లమెంటువరకు 3 శాతం రిజర్వేషన్ కల్పిండాలన్న డిమండ్‌కు మంచి స్పందన వస్తుందన్నారు. 1985 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు వికలాంగులకు భూపంపిణీ లో ప్రాధాన్యత కల్పించాలని జివో నెంబరు 1095 ను విడుదల చేశారని అయితే ఆతరువాత ముఖ్యమం త్రులు దానిని అటక ఎక్కించారని చెప్పారు. ఏదిఏమైనా రానున్న రోజుల్లో వికలాంగుల కోసం రాష్ట్రవ్యాప్తంగా రాజీలేని పోరాటం