జగన్‌పై దూకుడు తగ్గించిన లక్ష్మీనారాయణ?
posted on Aug 4, 2012 @ 10:16AM
సి.బి.ఐ. జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత వైయస్ జగన్ పట్ల దూకుడు తగ్గించుకున్నట్లు తెలుస్తుంది. వెనుక హైకోర్టు ఆదేశాలున్నాయో, కేంద్రప్రభుత్వం ఉందో, లేక సిబిఐ ఉన్నతాధికార ఆదేశాలు ఉన్నాయో తెలియడం లేదు. గతంలో జగన్‌ను ఇరుకున పెట్టడానికి శతవిధాలా ప్రయత్నించిన లక్ష్మీనారాయణ ఇప్పుడు ఆ కేసుపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని తెలిసింది. తీదనికి తోడు పదిహేనురోజుల దక్షిణాప్రికా పర్యటన ముగించుకొని తిరిగి ఉద్యోగ బాద్యతలు చేపట్టిన సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మీడియాకు చాలా దురంగా ఉంటున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తులపై దర్వాప్తు చేస్తూ ఒక వర్గానికి చెందిన మీడియాకే సమాచారాన్ని లీకు చేస్తున్నారంటూ ప్రింట్ మీడియాలోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ జరిగిన రాంద్దాంతాన్ని తలంచుకొని ఇకపై తన పని తాను చేసుకోవడమే బెస్టు అనుకున్నట్లు ఉన్నారు. గతంలో లక్ష్మీనారాయణ, తన అఫీషియల్ సెల్ నెంబరు కాల్ లిస్టును అనధికారికంగా పొందారని కంప్లయింట్ ఇసే,్త ముందే ప్రత్యర్థి మీడియాకు సమాచారం లీకు చేస్తున్నారని వైయస్ వర్గీయులు లక్ష్మీనారాయణపై కోర్టుకు వెళ్లి విచారణ జరిపించాలని కోరటం జరిగింది. దీంతో వివాదాస్పదంగా మారిన సిబిఐ ఆఫీసరుగా ముద్ర వేసుకోవలసి వచ్చింది.ఈ మద్య విశాఖ అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీలో జరిగిన అవక తవకలపై విచారణ జరిపి వివరాలు మీడియాతో మాట్లాడటం మినహాయించి లక్ష్మీనారయణ మీడియాకు ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం విశేషం.