రోశయ్య పదవి కాలం పూర్తి.... రాజకీయాల్లోకి రానే రాను..
posted on Sep 2, 2016 @ 11:02AM
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తమిళనాడు గవర్నర్ గా పదవి కాలం పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే రోశయ్య పదవి కాలం పొడిగింపుపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇప్పటికే మోడీకి లేఖ రాశారు. అయితే ఆ పొడిగింపు జరగలేదు. అయితే రోశయ్య మాత్రం ఇకపై ఎలాంటి బాధ్యతలు నెత్తినపెట్టుకోకుండా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే ఆ బాధ్యతలు మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు అప్పగించి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన జీవితంలో 60 సంవత్సరాల పాటు రాజకీయాలతోనే సరిపోయిందని.. ఇకపై కాంగ్రెస్ లో కాదు కదా...రాజకీయాల్లోకే ప్రవేశించబోనని తేల్చి చెప్పేశారు. ఏపీలో తాను నివాసాన్ని కోరుకోవడం లేదని, కాబట్టి ఏపీ రాజకీయాలు సైతం తనకు వద్దని రోశయ్య చెప్పడం గమనార్హం. మొత్తానికి ఇన్ని సంవత్సరాలకి రోశయ్యకి రాజకీయాలమీద విరక్తి పుట్టినట్టుంది. పాపం అందుకే రాజకీయాల్లోకి రానని చెప్పేశారు.