నేరాన్ని ఆంగీకరించిన రాఖీ యాదవ్.. అవును నేనే కాల్చా...
posted on May 14, 2016 @ 11:05AM
జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవి కుమారుడు రాకీ యాదవ్..తన కారును ఓవర్ టేక్ చేశాడని చెప్పి నడిరోడ్డుపై ఒక యువడికి కాల్చి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు రాఖీ యాదవ్ యువకుడిని కాల్చింది తనేనని తన నేరాన్ని అంగీకరించాడు. ఈరోజు జరిగిన విచారణలో రాఖీ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తొలుత తాను ఢిల్లీలో లేనని, కాల్చింది తాను కాదని ముందు బుకాయించిన రాకీ, ఆపై పోలీసుల విచారలో నిజం చెప్పాడు. మరోవైపు మనోరమదేవి రాఖీకి యాంటిసిపేయిటరీ బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఈకేసులో భాగంగా సోదాలు చేస్తున్న వారికి మనోరమాదేవి ఇంట్లో భారి ఎత్తున మద్యం సీసాలు లభించిన సంగతి తెలిసిందే. అయితే బీహార్లో ఇటీవలే సంపూర్ణ మద్యపాన నిషేందించిన సందర్భంగా.. నియమాలు అతిక్రమించినందుకు ఆమెను ఆరెళ్ల పాటు పదవి నుండి సస్పెండ్ చేసి.. కేసు నమోదు చేసుకున్న సంగతి తెలసిందే.