గుంటూరు జిల్లాలో పుష్కర పనులు వేగవంతం..
posted on May 14, 2016 @ 11:31AM
రానున్న కృష్ణా పుష్కరాల కోసం గుంటూరు జిల్లాలో పనులు వేగవంతమయ్యాయి. జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, నగర కమిషనర్ నాగలక్ష్మీ ఇతర అధికారులు గుంటూరు నగరంలో పర్యటించి పనులను పరిశీలించారు. పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దీంతో ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రహదారులను విస్తరిస్తున్నారు. నగరంలోని పట్టాభిపురం, గుజ్జనగుండ్ల, చినపలకలూరు, అమరావతి రోడ్డు తదితర ప్రాంతాలపై ప్రధానంగా ఫోకస్ చేశారు. నగరంలో పుష్కర పనుల కోసం రూ.68 కోట్లతో ప్రతిపాదనలు పంపగా...50 కోట్లు మంజూరయ్యాయని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. యాత్రికుల సౌకర్యం కోసం పెదకూరపాడులో ఎక్స్‌ప్రెస్ రైల్లు ఆగేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.