ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య
posted on Aug 12, 2014 @ 12:20PM
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాబిన్ విలియమ్స్ (63) ఆత్మహత్య చేసుకున్నారు. కాలిఫోర్నియాలోని టిబ్రోన్ ప్రాంతంలో వున్న తన నివాసంలో ఆయన ముఖానికి ప్లాస్లిక్ కవర్ చుట్టుకోని ఊపిరి ఆడకుండా చేసుకోవడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మంచి హాస్య నటుడిగా పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, డబ్బు సంపాదించిన రాబిన్ విలియమ్స్ ఇంత అర్ధంతరంగా ఆత్మహత్యకు పాల్పడటం వెనుక కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆయన నటించిన ‘మిసెస్ డౌట్‌ఫైర్’ చిత్రం ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాని కమల్‌హాసన్ ‘అవ్వై షణ్ముగై’, ‘చాచీ 420’ పేర్లతో తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. అలాగే రాబిన్ విలియమ్స్ నటించిన ‘జుమాన్జీ’ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. 1978లో హాలీవుడ్ నటుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన ‘మార్క్ అండ్ మిండీ’, ‘మిసెస్ డౌట్ ఫైర్’, ‘ది బర్డ్ కేజ్’, ‘అవేకెనింగ్’, ‘ఇన్‌స్నోమ్నియా’, ‘జుమాన్జీ’ లాంటి అనేక హిట్ సినిమాలలో నటించారు.