బీపీ ఎక్కువైతే ఏకంగా ఇన్ని ప్రమాదాలు ఉంటాయని తెలుసా?
posted on Jan 12, 2024 @ 10:28AM
అధిక రక్తపోటు అంటే హైపర్‌టెన్షన్ అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. రక్తపోటు సాధారణ పరిమితిని మించిపోయినప్పుడు శరీర అవయవాలను ప్రభావితం చేస్తుంది. అధిక రక్తపోటు రోగులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. సాధారణ అధికరక్తపోటు ఉన్నవారికి గుండెపోటు సమస్య పొంచి ఉంటుందని అంటారు. అయితే కేవలం గుండె మాత్రమే కాకుండా మరిన్ని విషయాల మీద బీపీ ప్రభావం ఉంటుంది. బీపీ ఎక్కువైతే శరీరంలో ఏ ఏ అవయవాల మీద దారుణమైన ప్రభావం ఉంటుందో తెలుసుకుంటే వాటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
గుండె సంబంధ సమస్యలు..
రక్తపోటు పెరగడం గుండెకు అస్సలు మంచిది కాదు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్‌తో సహా హైపర్‌టెన్షన్ గుండెకు పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది. రక్తపోటు పెరిగినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. ఈ సమయంలో శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తం ప్రవహించడం కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో హార్ట్ అటాక్ సమస్య వస్తుంది.
కరోనరీ ఆర్టరీ..
కరోనరీ ఆర్టరీ అనేది గుండె సంబంధిత సమస్య. అధిక రక్తపోటు కారణంగా ధమనులు ఇరుకుగా మారి దెబ్బతింటాయి. దీని కారణంగా గుండె నుండి రక్తాన్ని సరఫరా చేయడంలో ఇబ్బంది పడతాయి. ఇలాంటి పరిస్థితిలో గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.
కంటి సమస్యలు..
హైపర్‌టెన్షన్ కంటిలో రక్తస్రావాన్ని ప్రభావితం చేయడం ద్వారా రెటినోపతి, గ్లాకోమా వంటి కంటి సమస్యలను కలిగిస్తుంది. గ్లాకోమా అనేది కంటిలోపల రక్తపోటు పెరగడం వల్ల వచ్చే కంటి వ్యాధి. గ్లాకోమాకు హైపర్‌టెన్షన్ ఒక ముఖ్యమైన ప్రమాద కారకంగా వైద్యులు చెబుతున్నారు.
మానసిక సమస్యలు..
రక్తపోటు వల్ల మొదట గుండెకు ముప్పు కలిగినా గుండె తర్వాత ఇది మెదడుకు పొంచి ఉంటుంది. హైపర్‌టెన్షన్ మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. అధిక రక్తపోటు కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోవచ్చు. మెదడుకు రక్తం, ఆక్సిజన్ సక్రమంగా ప్రసరణ కావడం అవసరం.కానీ అధిక రక్తపోటు ఈ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తుతాయి.
మెటబాలిక్ సిండ్రోమ్..
అధిక రక్తపోటు మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యను కలిగిస్తుంది. ఇది మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి, రక్తపోటుకు సకాలంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
*నిశ్శబ్ద.