మరో జంతువనుకుని ఢీకొట్టి గాయపడ్డ రైనో సేఫ్
posted on Oct 15, 2022 @ 10:05AM
రోడ్డుమీద వెళుతున్న టీవీలర్ వేగంగా వస్తూ అక్కడ ఆగిన ఆటోకి తగులుకుంది, కుర్రాడు కిందపడ్డాడు. వాడికి దెబ్బలు తగిలాయా లేదా అన్నది కాకుండా అసలు పార్కింగ్ ప్లేస్ కానిచోట ఆటో నిలిపిన ఆటో డ్రైవ ర్ ఆటో మీద గీత పడిందని ఆ కుర్రాడిని తిటిపోశాడు. కొద్దిరోజుల తర్వాత ఇలాంటి సంఘటనే జరిగింది మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఆ సంగతి వదిలి కారు పెద్ద మనిషి రెండువేలు కట్టించుకు న్నా డు. మనుషులం గనుక గాయపడినా, బండికి దెబ్బతగిలినా గొడవపడతాం, ఆస్పత్రికి వెళతాం. మరి నోరులేని జంతువు ఢీకొని గాయపడితే? అవును ఇది ఊహించని ప్రమాదమే. చాలా ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లోంచి రోడ్డు దాటి వెళుతూ గాయపడుతూంటాయి, ఒకటో అరో చనిపోతూనూ ఉంటాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా వాటి సంగతి పట్టించుకోవు. కానీ అస్సాం ముఖ్యమంత్రి బిశ్వశర్మ మాత్రం పట్టించుకు ని రైనో బాగోగులు కను గొన్నారు.
కజిరంగా నేషనల్ పార్కు సమీపంలో ఒక లారీ ఆగిఉంది. సాధారణంగా జింకలు, లేళ్లు, కుందేళ్లు వంటివి ఆ ప్రాంతాల్లో రోడ్డు దాటి వెళుతూంటాయి. అలాగే మొన్నామధ్య ఒక రైనో రోడ్డుమీదకి వచ్చింది. లారీని చూసింది. ఇదేదో తనవంటి పెద్ద జంతువు అనుకుని పొడవడానికి దూసుకువెళ్లింది. దానికి అది ఆగి ఉన్న లారీ అన్నది తెలీదుగదా. లారీ పక్కభాగాన్ని బలంగా ఢీకొట్టింది. కానీ లారీ కాస్తంత కదిలిం ది. మళ్లీ ఢీకొట్టిం ది కానీ లారీ పక్కభాగానికి ఉండే రేకు సొట్టబడిందంతే. రైనో మాత్రం బాగానే గాయపడి పడి పో యింది. లేవ బోయింది..కానీ దానివల్ల కాలేదు. ఇంతలో లారీ వెళిపోయింది. రైనో లేచి మెల్లగా అడవిలోకి వెళిపోయింది. దాని సంగతి తెలిసి అధికారులు డ్రోన్ సహాయంతో అది ఎక్కడుందో తెలుసు కుని ప్రాణాపాయం లేదని తెలిసి హమ్మయ్య అనుకున్నారు. అదే సంగతి ముఖ్య మంత్రి బిశ్వశర్మకి తెలియజేశారు.
అసలు అటవీ ప్రాంతం దగ్గర్లోని హైవేలకు స్పీడ్ బ్రేకర్లు గురించి చాలాకాలం నుంచే అక్కడి వారు గోడు పెడుతున్నారు. కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అక్కడే కాదు దేశంలో చాలాప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. కనీసం ఆ ప్రాంతాల్లో వేగం తగ్గించి వాహనాలు వెళ్లాలన్న హోర్డింగ్ హెచ్చరికలూ లేకపోవడం వల్లనే మూగజీవాలు చాలా ప్రమాదాలకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అటవీశాఖ, రైల్వే శాఖకు, రోడ్డురవాణాశాఖకు అనేక ఫిర్యాదులు వెళ్లినా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. మూగజీవాల సంరక్షణ గురించి పెద్ద ప్రచారం చేసేవారంతా ప్రధానంగా ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.