ఢిల్లీలో యుపిఎస్సీ చైర్మన్ తో రేవంత్ రెడ్డి భేటీ
posted on Jan 5, 2024 @ 1:04PM
తెలంగాణ ముఖ్యమంత్రి శుక్రవారం ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు. గత ప్రభుత్వ హయంలో పేపర్ లీక్ వ్యవహారంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్రదిష్ట మూట కట్టుకుంది. కొత్తగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ హాయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి రేవంత్ సర్కార్ వాటి మీద దృష్టి పెట్టింది అప్పట్లో . తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో పలు పరీక్షలను రద్దు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మెన్ గా ఉన్న జనార్ధన్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ ఆమోదించలేదు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్, సభ్యులు రాజీనామాలపై గవర్నర్ ఆమోదించిన తర్వాత కొత్త సభ్యులను నియమించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది.తెలంగాణలో గతంలో నిర్వహించిన పరీక్షల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చాయి.ఈ విషయమై పరీక్షలను రద్దు చేశారు. వంద మందికి పైగా సిట్ బృందం అరెస్ట్ చేసింది. దరిమిలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్‌సీ ఛైర్మెన్ ను ఇవాళ కలుసుకున్నారు. యూపీఎస్‌సీ పరీక్షల విధానంపై చర్చించారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఉన్నారు.