భారీగా ఎర్రచందనం స్వాధీనం...నలుగురు స్మగ్లర్లు అరెస్ట్
posted on Aug 27, 2025 @ 7:58PM
ఉమ్మడి కడప జిల్లాలో ఎర్రచందనం తరలిపోతూనే ఉంది .టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పలు చోట్ల ఎర్రచందనం స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. స్మగ్లర్ లను అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా స్మగ్లర్లు ఏదో ఒకచోట స్మగ్లింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మైదుకూరు మండలంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు స్వాధీనం పోలీసు స్వాధీనం చేసుకున్నారు .ఇందుకు సంబంధించిన వివరాలను మైదుకూరు డీఎస్పి రాజేంద్రప్రసాద్ విలేకరులకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 ఎర్రచందనం దుంగలు ,గొడ్డలి రాళ్లు స్వాధీనం చేసుకున్న టాగ్లు తెలిపారు. దుంగలను స్వాధీనం చేసుకుని స్మగ్లర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో వారు పోలీసులపై రాళ్లు, గొడ్డలితో దాడికి దిగినట్లు తెలిపారు. స్మగ్లర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. స్మగ్లర్లను అరెస్ట్ చేసి దుంగలు స్వాధీనం చేసుకోవడంలో విజవంతంగా విధులు నిర్వహించిన మైదుకూరు రూరల్ సిఐ శివశంకర్, దువ్వూరు ఎస్సై వినోద్ కుమార్ సిబ్బందిని డి.ఎస్.పి రాజేంద్రప్రసాద్ అభినందించారు.