లాప్‌టాప్ ఆర్డర్ చేస్తే బట్టల సబ్బులు వచ్చాయి!
posted on Sep 28, 2022 @ 1:50PM
ఇప్పుడంతా ఆన్‌లైన్ వ్యాపారమే. తినే పదార్ధాలు, వ్యాపార వస్తువులు, లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు కూడా ఫ్లిప్ కార్ట్ వంటివాటిలో బుక్ చేసి తెప్పించుకుంటున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లి గంటల తర బడి వెతకడం, కావలసిన వస్తువుని వెతికి తెచ్చుకోవడం అనేది సమయంతో కూడిన పని. చాలామంది ఆ సమయం వెచ్చించలేకనే ఆన్‌లైన్‌లో కొనుగోలుకే ఇష్టపడుతున్నారు. ఫ్లిప్ కార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకో వడం, కావలసినవి ఆర్డర్ చేసుకుంటే పెద్దగా శ్రమపడకుండానే ఇంటికే అన్ని చేరడం ఈ రోజు ల్లో పరిపాటి అయింది. అయితే ఈ రద్దీ ఎక్కువయింది. కనుక ఎవరు ఏమి తెప్పించుకుంటున్నారన్న ది కాస్తంత గమనించుకోవాలి. డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్లిన చాలాసేపటికి చూసుకుంటే మీరు ఆర్డర్ చేసినది కాకుం డా మరోటి ఉండావచ్చు! అవును అదే జరిగింది యశస్వీ శర్మకి.
అహ్మదాబాద్ ఐఐ ఎం విద్యార్ధి యశస్వీ శర్మ. తన తండ్రికి లాప్ టాప్ కొనాలనుకున్నాడు. ఈమధ్య బిగ్ బిలియన్ డేస్ సేల్ అని ఫ్లిప్ కార్ట్ మంచి ఆఫర్లు ప్రకటించింది. సరే తక్కువలో వస్తుందని యశస్వీ లాప్ టాప్ బుక్ చేశాడు.
అదే రోజు యశస్వీ తండ్రి ఆ ప్యాక్‌ను అందుకున్నట్టు యశస్వీకి ఫ్లిప్ కార్ట్ మెసేజ్ వచ్చింది. ఓకే అనుకున్నాడు ఈ కుర్రాడు. తీరా పాకెట్ విప్పి చూస్తే ఇంటిల్లపాదీ ఆశ్చర్యపోయారు. లాప్ టాప్‌కి బదులు అం దులో బట్టలు ఉతికే సబ్బులు ఉన్నాయి! ఇదేందిరా నాయనా! అనుకున్నారు. ఫ్లిప్ కార్ట్ కి బుక్ చేస్తే ఎన్నడూ ఇలా జరగలేదే అనుకున్నారు. పైగా ఏదయినా వస్తువు తెచ్చినా డెలివరీ బాయ్ దాన్ని ఆ అడ్రస్లో ఉన్నవారి చేత తీయించి చూసి ఓకే అనుకునే వెళుతూంటారు. కానీ ఈసారి మాత్రం ఇలా జరిగిం దనుకున్నారు యశస్వీ కుటుంబంలో అంతా.
బహుశా, డెలివరీ బాయ్ పని ఒత్తిడిలోనో, త్వరగా పని ముగించుకోవాలనుకునో హడావుడిలో ఒకరిది మరొకరికి ఇచ్చాడేమో అనీ అనుకున్నారు. కానీ అలా జరగడానికి వీలేలేదు. ఎందుకంటే యశస్వీ తండ్రి అందుకున్న ప్యాకెట్ మీద అడ్రస్ వాళ్లదే ఉంది! మరి ఇదెలా జరిగింది. మూడు నాలుగు రోజుల తర్వాత దీన్ని గురించి ఫిర్యాదు చేశారు. జరిగిన నష్టానికి డబ్బు చెల్లించడానికి ఫ్లిప్‌కార్ట్ ఓకే అనేసింది. కానీ చిత్రమేమంటే, ఈ సబ్బులు బుక్ చేసినవారు ఇంకెంత కంగారుపడుతూంటారో. వారికి లాప్ టాప్ వెళ్లి ఉంటే, అక్కడ దాని అవసరంలేని బామ్మలు ఉంటే పరిస్థితి ఏమిటి?!