లార్డ్స్ పెవిలియన్ లా దుర్గా పూజా మందిరం
posted on Sep 28, 2022 @ 12:31PM
భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లోని పెవిలియన్ పట్ల ఇష్టం ఇంకా తగ్గలేదు. కోల్‌కతాలో మిథాలీ సంఘం వారు ఏర్పాటు చేసిన దుర్గాపూజ మందిరం అచ్చం లార్డ్స్ పెవిలియన్‌లానే ఉన్నది. దీన్ని మంగళవారం గంగూలీ ఆరంభించాడు.
ప్రపంచ క్రికెట్ మక్కాగా పేర్కొనే ఇంగ్లండ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ తో బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్‌కు గొప్ప అనుబంధం ఉన్నది. 2002 ఇంగ్లండ్, భారత్ సిరీస్‌లో చివరి మ్యాచ్ అక్కడ భారత్ అద్బుత విజయం సాధించింది. ఆ ఆనందంలో గంగూలీ అక్కడి పెవిలియన్ నుంచి మ్యాచ్ చివరి క్షణాలు ఆస్వాదిస్తూ, విజయం సాధించిన వెంటనే టీషర్ట్ విప్పి గాల్లోకి తిప్పుతూ తన అమితానందాన్ని ప్రేక్షకు లకు, క్రికెట్ వీరాభిమానులకు తెలియజేయడం ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ మ్యాచ్‌లో అప్పటి సూపర్ స్టార్ యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ తో కలిసి ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన డం ఇప్ప టికీ క్రికెట్ వీరాభిమానులు మరువలేరు. ఇంగ్లండ్‌లో ఆ జట్టు మీదనే భారత్ లార్డ్స్లో చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవడం క్రికెట్ చరిత్రలో చెప్పుకోదగ్గ అంశం. కెప్టెన్ గంగూలీ ఆ విజయానందాన్ని అత్యంత ఆహ్లాదంతో, విజయగర్వంతో లార్డ్స్ బాల్కనీ నుంచి ప్రకటించడం ఎప్ప టికీ గుర్తుండిపోతుంది.
గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు ఆడి 7,212 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 13 అర్ధ సెం చరీలు ఉన్నాయి. బౌలర్‌గానూ ఎంతో ప్రతిభ ప్రదర్శించి 32 వికెట్లు తీశాడు. ఓడీఐల్లో మాజీ కెప్టెన్ గంగూలీ 311 మ్యాచ్‌ల్లో 11,363 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి.